AP Anganwadi Helper Jobs 2025 : ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ హెల్పర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. విశాఖపట్నం జిల్లాలో గల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. భీమునిపట్నం, పెందుర్తి, విశాఖపట్నం ప్రాజెక్టుల్లో మొత్తం 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలి.

ఖాళీల వివరాలు :
విశాఖపట్నం జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ మరియు సాధికారత శాఖ తాజాగా అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ICDS ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోస్టర్ పాయింట్ల ప్రకారం OC, SC, ST, BC, EWS కేటగిరీలకు అవకాశాలు ఉన్నాయి.
ప్రాజెక్టు పేరు | ఖాళీల సంఖ్య |
భీమునిపట్నం | 11 |
పెందుర్తి | 21 |
విశాఖపట్నం | 21 |
మొత్తం | 53 |
Also Read : NIT Andhra Pradesh Recruitment 2025 | టెక్నికల్ అసోసియేట్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు.. ఇవిగో వివరాలు
అర్హతలు :
AP Anganwadi Helper Jobs 2025 అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.
- స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.
- 7వ తరగతి కచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి.
- 7వ తరగతి అభ్యర్థులు లేని పక్షంలో, అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన అభ్యర్థులు పరిగణనలోకి తీసుకుంటారు.
వయోపరిమితి :
AP Anganwadi Helper Jobs 2025 అభ్యర్థులకు 01.07.2025 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 21 సంవత్సరాలు దాటిన వారు అందుబాటులో లేకపోతే 18 సంవత్సరాలు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
AP Anganwadi Helper Jobs 2025 దరఖాస్తు ఫీజు గురించి నోటిఫికేషన్ లో ప్రస్తావించలేదు. అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
AP Anganwadi Helper Jobs 2025 అభ్యర్థుల ఎంపిక మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
ప్రాధాన్యత పాయింట్లు:
- 10వ తరగతి మార్కులు : 50 పాయింట్లు
- అంగన్వాడీ/Pre-School Teacher Training లేదా సంబంధిత సర్టిఫికేట్ : 5 పాయింట్లు
- వితంతువులకు : 5 పాయింట్లు (మైన్‌ర్ పిల్లలున్న వితంతువులకు అదనంగా 5 పాయింట్లు)
- అనాథ/హోం లేదా ప్రభుత్వ సంస్ధలలో పెరిగినవారికి : 10 పాయింట్లు
- వికలాంగులకు : 5 పాయింట్లు
- మౌఖిక ఇంటర్వ్యూ : 20 పాయింట్లు
మొత్తం: 100 పాయింట్లు
Also Read : APPSC Notification 2025 | ఏపీ జైళ్ల శాఖలో జాబ్స్.. వెంటనే అప్లయ్ చేయండి..
జీతం వివరాలు :
AP Anganwadi Helper Jobs 2025 అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.7,000/- గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
AP Anganwadi Helper Jobs 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫారం
- అధికారిక నోటిఫికేషన్‌తో పాటు Application Form ఇవ్వబడింది.
- అభ్యర్థులు తమ వివరాలు (పేరు, తండ్రి/భర్త పేరు, గ్రామం/వార్డు పేరు, విద్యార్హత, వయస్సు, కులం మొదలైనవి) సరిగ్గా నింపాలి.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో జతచేయాలి.
అభ్యర్థి నుండి అవసరమైన ధృవపత్రాలు (Attested copies తప్పనిసరి):
- స్థానిక నివాస ధృవీకరణ పత్రం (Nativity/Residence Certificate)
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- ఓటర్ ID
- విద్యార్హత సర్టిఫికేట్ (కనీసం 7వ తరగతి పాసు)
- కుల ధృవపత్రం (SC/ST/BC/EWS అభ్యర్థులకు మాత్రమే)
- EWS సర్టిఫికేట్ (తగినట్లయితే)
- వికలాంగుల సర్టిఫికేట్ (తగినట్లయితే)
పై అన్ని సర్టిఫికేట్‌లు గెజిటెడ్ అధికారి చేత అట్టెస్ట్ చేయించాలి.
ఎక్కడ సమర్పించాలి?
- పూర్తిగా నింపిన దరఖాస్తును అన్ని అవసరమైన పత్రాలతో కలిపి కింది చిరునామాకు పంపాలి.
- సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయం (భీమునిపట్నం / పందుర్తి / విశాఖపట్నం) కి స్వయంగా లేదా పోస్టు ద్వారా సమర్పించాలి.
- సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయం (భీమునిపట్నం / పందుర్తి / విశాఖపట్నం) కి స్వయంగా లేదా పోస్టు ద్వారా సమర్పించాలి.
- సమర్పించిన వెంటనే రశీదు (Receipt) ఇవ్వబడుతుంది.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 03 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 14 అక్టోబర్, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |
Also Read : RRB NTPC Notification 2025 Out | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 8,850 పోస్టులు
3 thoughts on “AP Anganwadi Helper Jobs 2025 | అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్”