AP Academic Instructors Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ రాష్ట్రంలోని Govt/ZPP/MPP/Municipality & Municipal Corporation పాఠశాలల్లో 1,146 Academic Instructor పోస్టులను భర్తీ చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికంగా 5 నెలల పాటు మాత్రమే ఉంటాయి. ప్రతి నెలా ₹10,000 – ₹12,500 వరకు హానరేరియం అందిస్తోంది. ఈ నియామకం మండల స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి, జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ ద్వారా పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు 08 డిసెంబర్ 2025 నుంచి విధుల్లో చేరాలి.
ఖాళీల వివరాలు (Vacancy Details)
మొత్తం ఖాళీలు – 1,146 పోస్టులు
- School Assistants: 892
- Secondary Grade Teachers (SGT): 254
ఈ పోస్టులు ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ & కార్పొరేషన్ పాఠశాలలకు కేటాయించబడ్డాయి.
అర్హతలు (Eligibility Criteria)
AP Academic Instructors Recruitment 2025 అభ్యర్థులు అర్హతలు మరియు స్థానికత ఆధారంగా ఎంపిక చేయబడతారు.
అకాడెమిక్ + ప్రొఫెషనల్ అర్హతల మార్కుల ఆధారంగా 75:25 రేషియోలో మెరిట్ నిర్ణయిస్తారు.
వివరాలు:
- School Assistant పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో అవసరమైన విద్యార్హతలు
- SGT పోస్టులకు సంబంధిత అర్హతలు
- స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం (తమ గ్రామం/మండలానికి చెందిన అభ్యర్థులు)
వయోపరిమితి (Age Limit)
AP Academic Instructors Recruitment 2025 ఈ పోస్టులకు వయోపరిమితి ప్రత్యేకంగా ఇవ్వలేదు. సాధారణ నియమాల ప్రకారం జిల్లాల ఎంపిక కమిటీ నిర్ణయిస్తుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
AP Academic Instructors Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
AP Academic Instructors Recruitment 2025 ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, మండల & జిల్లా స్థాయి కమిటీల ద్వారా జరుగుతుంది.
ఎంపిక ప్రాసెస్:
మెరిట్ + స్థానికతను పరిగణలోకి తీసుకుని జిల్లా కమిటీ ద్వారా ఫైనల్ సెలెక్షన్.
వివరాలు:
- అభ్యర్థులు 05.12.2025 లోపు MRC (Mandal Resource Center) వద్ద దరఖాస్తు చేయాలి.
- MEOలు అందిన అప్లికేషన్లను DEOకి పంపాలి.
- DEO కార్యాలయం అకాడెమిక్ & ప్రొఫెషనల్ మార్కుల ఆధారంగా మెరిట్ తయారు చేస్తుంది.
- అకాడెమిక్: 75%
- ప్రొఫెషనల్: 25%
- జిల్లా స్థాయి కమిటీ సెలెక్షన్ చేస్తుంది:
- District Collector (Chairman)
- DEO (Convenor)
- DIET Principal/DEO (Member)
- 06.12.2025 నాటికి సెలెక్షన్ పూర్తి చేయాలి.
- 08.12.2025 న ఆపాదించిన పాఠశాలలో విధుల్లో చేరాలి.
జీతం వివరాలు (Honorarium / Salary)
| పోస్టు | నెల జీతం (హానరేరియం) |
| School Assistant | ₹12,500 |
| SGT | ₹10,000 |
దరఖాస్తు విధానం (How to Apply)
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో, మండల స్థాయిలో పెట్టుకోవాలి. అభ్యర్థులు తమ MRC ద్వారా మండల స్థాయిలో దరఖాస్తులు సమర్పించాలి.
- MEO విడుదల చేసే పత్రిక ప్రకటన (Press Note) చూడాలి.
- మీ మండలంలోని MRC వద్ద దరఖాస్తు ఫారం సమర్పించాలి.
- అవసరమైన సర్టిఫికెట్లు (అకాడెమిక్ + ప్రొఫెషనల్) అటాచ్ చేయాలి.
- 05.12.2025 లోపు అప్లికేషన్ ఇవ్వాలి.
- ఎంపికైన అభ్యర్థుల జాబితాను SMCల ద్వారా పాఠశాలలకు పంపిస్తారు.
- అభ్యర్థులు 08.12.2025 న విధుల్లో చేరాలి.
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- అప్లికేషన్ చివరి తేదీ: 05.12.2025
- సెలెక్షన్ పూర్తి తేది: 06.12.2025
- విధుల్లో చేరే తేదీ: 08.12.2025
- కాంట్రాక్ట్ గడువు: 08.12.2025 to 07.05.2026 (5 నెలలు)