AIIMS Mangalagiri Recruitment 2025 : మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ మరియు సీనియర్ డెమాన్ స్టేటర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు మార్చి 15వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
AIIMS Mangalagiri Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 69
మంగళరిగి ఎయిమ్స్ లో సీనియర్ రెసిడెంట్, సీనియర్ డెమాన్ స్ట్రేటర్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఉన్నాయి. 33 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అనస్తీషియాలజీ, అనాటమీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ హెమటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సైకియాట్రీ తదితర విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల కేటగిరి :
కేటగిరి | పోస్టులు |
జనరల్ | 17 |
ఓబీసీ | 23 |
ఎస్సీ | 13 |
ఎస్టీ | 08 |
ఈడబ్ల్యూఎస్ | 08 |
అర్హతలు :
AIIMS Mangalagiri Recruitment 2025 మంగళగిరి ఎయిమ్స్ లో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ లేదా డీఎన్బీ, మెడికల్ పీజీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.
వయస్సు :
AIIMS Mangalagiri Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
కేటగిరి | వయస్సు |
జనరల్ | 45 ఏళ్ల లోపు |
ఎస్సీ, ఎస్టీ | +5 |
ఓబీసీ | +3 |
దరఖాస్తు ఫీజు :
AIIMS Mangalagiri Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,500/- మరియు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.1,000/- ఫీజు చెల్లించాలి. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు ఉండదు. అప్లికేషన్ ఫీజును AIIMS Mangalagiri పేరు మీద డిమాండ్ డ్రాఫ్ తీయాలి.
ఎంపిక ప్రక్రియ :
AIIMS Mangalagiri Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు మార్చి 15వ తేదీన నిర్వహిస్తారు. ఒకవేళ దరఖాస్తులు ఎక్కువగా వస్తే రాత పరీక్ష నిర్వహించే ఛాన్స్ ఉంది.
జీతం :
AIIMS Mangalagiri Recruitment 2025 పోస్టులకు ఎంపికైన మెడికల్ అభ్యర్థులకు నెలకు రూ.67,700/-, నాన్ మెడికల్ అభ్యర్థులకు నెలకు రూ.56,100/- జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
AIIMS Mangalagiri Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లోని వివరాలను పూర్తి చేేయాలి. పూర్తి చేసిన అప్లికేషన్ తో పాటు విద్యార్హత, కుల ధ్రువీకరణ, అవసరమైన పత్రాలను జత చేయాలి. వీటిని ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.
ఇంటర్వ్యూ తేదీ మరియు చిరునామా :
AIIMS Mangalagiri Recruitment 2025 పోస్టులకు మార్చి 15వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి గుంటూరులోని మంగళగిరి ఎయిమ్స్ అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్ లో ఉంటాయి.
Notification & Application : CLICK HERE
Official Website : CLICK HERE