AIC MT Recruitment 2025 : Agriculture insurance company of india limited నుంచి మేనేజ్మెంట్ ట్రైనీల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వ్యవసాయ సంబంధిత బీమా కంపెనలో పనిచేేయడానికి ఆసక్తి ఉన్న వారికి ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. జనరలిస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు యాక్చురియల్ విభాగాల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
AIC MT Recruitment 2025
పోస్టుల వివరాలు :
అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద మేనేజ్మెంట్ ట్రైనీల నియాకానికి ఖాళీల సంఖ్యను వెల్లడించింది. మొత్తం 55 ఖాళీలు ఉన్నాయి.
● జనరలిస్ట్ – 30
● ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 20
● యాాక్చురియల్ – 05
అర్హతలు :
AIC MT Recruitment 2025 అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద మేనేజ్మెంట్ ట్రైనీల నియామకానికి అర్హతలు కింది విధంగా ఉన్నాయి.
● జనరలిస్ట్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
● ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నిక్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇన్ఫర్మేన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. BE / B.Tech / ME / M.Tech / MCA
● యాక్చురియల్ : ఈ పోస్టులకు స్టాటిస్టిక్స్ / మ్యాథమేటిక్స్ / యాక్చురియల్ సైన్సెస్ / ఎకనామిక్స్ / ఆపరేషన్స్ రీసెర్చ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి.
వయస్సు :
AIC MT Recruitment 2025 ఉద్యోగాలు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
AIC MT Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000/- చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200/- ఫీజు చెల్లించాలి. దరఖాస్తులను ఆన్ లైన్ లో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :
AIC MT Recruitment 2025 దరఖాస్తు చేేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన వారికి ఉద్యోగం అయితే ఇస్తారు.
జీతం :
Agriculture insurance company of india limited మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ లోనే నెలకు రూ.60,000/- వరకు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక జీతం ఇంకా పెంచి ఇస్తారు.
దరఖాస్తు విధానం :
AIC MT Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు Agriculture insurance company of india limited అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలు, ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి. మరియు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. తర్వాత అప్లికేషన్ లో వివరాలను పరిశీలించి సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభం : 30 జనవరి 2025
ఆన్ లైన్ అప్లికేషన్ కు చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2025
పరీక్ష తేదీ : మార్చి లేదా ఏప్రిల్
Apply Online : CLICK HERE
1 thought on “AIC MT Recruitment 2025 | అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ | ట్రైనింగ్ లోనే రూ.60,000/- జీతం”