AAI Junior Executive recruitment 2025 ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 976 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం గేట్ 2023, 2024, 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
AAI Junior Executive recruitment 2025 Overview
నియామక సంస్థ | ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా |
పోస్టు పేరు | జూనియర్ ఎగ్జిక్యూటివ్ |
పోస్టుల సంఖ్య | 976 |
దరఖాస్తు ప్రక్రియ | 28 ఆగస్టు – 27 సెప్టెంబర్, 2025 |
ఎంపిక విధానం | గేట్ 2023 / 2024 / 2025 స్కోర్ కార్డు |
పోస్టుల వివరాలు :
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 976 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. ఆర్కిటెక్చర్, సివిల, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగాలు | ఖాళీల సంఖ్య |
ఆర్కిటెక్చర్ | 11 |
సివిల్ ఇంజనీరింగ్ | 199 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 208 |
ఎలక్ట్రానిక్స్ | 527 |
ఐటీ | 31 |
అర్హతలు :
AAI Junior Executive recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విభాగాలను బట్టి విద్యార్హతలు మారుతాయి.
- ఆర్చిటెక్చర్ : ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ + కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రిజిస్ట్రేషన్
- సివిల్ ఇంజనీరింగ్ : సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్
- ఎలక్ట్రానిక్స్ : ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రికల్ (EC) లో బీఈ / బీటెక్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఐటీ / ఎలక్ట్రానిక్స్ లో బీఈ / బీటెక్ (లేదా) MCA
వయస్సు :
AAI Junior Executive recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
AAI Junior Executive recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.300/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / మహిళలు / AAI అప్రెంటిస్ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
AAI Junior Executive recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తిగా గేట్ 2023, 2024, 2025 స్కోర్ కార్డు ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.
- చెల్లుబాటు అయ్యే గేట స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్
- అప్లికేషన్ ధ్రువీకరణ
- ఫైనల్ మెరిట్ లిస్ట్
జీతం వివరాలు :
AAI Junior Executive recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 – రూ.1,40,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
AAI Junior Executive recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలో AAI Junior Executive recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయి ఆన్ లైన్ అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 27 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |