ISRO SAC Recruitment 2026 | ఇస్రోలో బంపర్ జాబ్స్ | జీతం ₹67,100 నుంచి..

ISRO SAC Recruitment 2026 : అంతరిక్ష రంగంలో పని చేయాలనుకునే ఇంజినీరింగ్, సైన్స్ అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కి చెందిన Space Applications Centre (SAC), అహ్మదాబాద్ 2026 సంవత్సరానికి Scientist/Engineer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతం, కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలు లభిస్తాయి.

ఖాళీల వివరాలు (Vacancy Details)

ఈ నోటిఫికేషన్ ద్వారా Scientist/Engineer ‘SD’ (Level-11) మరియు Scientist/Engineer ‘SC’ (Level-10) పోస్టులు భర్తీ చేయనున్నారు. RF & Microwave, Electronics, Computer Science, Power Electronics, Agriculture, Statistics, Physics, Oceanography వంటి అనేక డొమైన్లలో ఖాళీలు ఉన్నాయి. పోస్టులు ISRO/SACతో పాటు NRSC, VSSC, NESAC వంటి కేంద్రాల్లో ఉంటాయి. మొత్తం 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

Also Read : Supreme Court Law Clerk Recruitment 2026 | నెలకు ₹1 లక్ష జీతంతో సుప్రీం కోర్టులో ఉద్యోగాలు

అర్హతలు (Educational Qualifications)

అభ్యర్థులు సంబంధిత విభాగంలో PhD / M.E / M.Tech / M.Sc / B.E / B.Tech / B.Sc పూర్తి చేసి ఉండాలి. ప్రతి పోస్టుకు నిర్దిష్ట స్పెషలైజేషన్ మరియు మార్కుల శాతం నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సాధారణంగా 60%–65% మార్కులు లేదా నిర్దిష్ట CGPA అవసరం. అర్హతలు పోస్టు కోడ్‌ను బట్టి మారుతాయి.

వయోపరిమితి (Age Limit)

ISRO SAC Recruitment 2026 12 ఫిబ్రవరి 2026 నాటికి అభ్యర్థుల వయస్సు పోస్టును బట్టి మారుతుంది. 

  • Scientist/Engineer SD: 18–35 సంవత్సరాలు
  • Scientist/Engineer SC (M.E/M.Tech): 18–30 సంవత్సరాలు
  • Scientist/Engineer SC (M.Sc): 18–28 సంవత్సరాలు

SC, ST, PwBD, Ex-Servicemen మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు (Application Fee)

ISRO SAC Recruitment 2026 – Scientist/Engineer SD పోస్టులకు అప్లికేషన్ ఫీజు లేదు. Scientist/Engineer SC పోస్టులకు ₹750 ఫీజు ముందుగా చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రూ.500 రీఫండ్ ఉంటుంది. మహిళలు, SC, ST, PwBD, Ex-Servicemen అభ్యర్థులకు పూర్తి రీఫండ్ వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ (Selection Process)

ISRO SAC Recruitment 2026 మొదట ఆన్‌లైన్ అప్లికేషన్ ఆధారంగా స్క్రీనింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారిని రాత పరీక్ష / ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది ఎంపిక పూర్తిగా అభ్యర్థి ప్రదర్శన ఆధారంగా ఉంటుంది. కనీస అర్హతలు ఉన్నంత మాత్రాన ఇంటర్వ్యూకు పిలుస్తారు అని హామీ లేదు.

జీతం వివరాలు (Salary Details)

ISRO SAC Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. 

  • Scientist/Engineer SD – Level-11 : ₹67,100 – ₹2,08,700.
  • Scientist/Engineer SC – Level-10 : ₹56,100 – ₹1,77,500.
  • దీనితో పాటు DA, HRA, TA, NPS/UPS, మెడికల్ సదుపాయాలు, LTC, క్వార్టర్స్ వంటి కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం (How to Apply)

ISRO SAC Recruitment 2026 అభ్యర్థులు 23 జనవరి 2026 ఉదయం 10 గంటల నుంచి 12 ఫిబ్రవరి 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. SAC అధికారిక వెబ్‌సైట్స్ sac.gov.in లేదా careers.sac.gov.in ద్వారా అప్లికేషన్ సమర్పించాలి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయలేరు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు ప్రారంభం : 23 జనవరి, 2026
  • చివరి తేదీ : 12 ఫిబ్రవరి, 2026
NotificationClick here
Apply OnlineClick here

Also Read : SAI Assistant Coach Recruitment 2026 | 323 అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News
error: Content is protected !!