DSSSB MTS Recruitment 2025 | 10వ తరగతితోనే ప్రభుత్వ ఉద్యోగం – 714 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

DSSSB MTS Recruitment 2025: ఢిల్లీ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో Multi Tasking Staff (MTS) ఖాళీల భర్తీ కోసం DSSSB అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 714 పోస్టులు ఉన్నాయి.  డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ లో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

ఈ పోస్టులు డిల్లీ ప్రభుత్వానికి చెందినవి కదా.. మనం అర్హులమా? కాదా? అని మీకు డౌట్ రావచ్చు. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, నోటిఫికేషన్ లో ఇచ్చిన అర్హతలు ఉంటే సరిపోతుంది. రిజర్వేషన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా అర్హతలు ఉంటే వెంటనే అప్లయ్ చేసేయండి. మీకు కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే పెడుతారు. 

Overview 

  • సంస్థ: DSSSB (Delhi Subordinate Services Selection Board)
  • పోస్టు: Multi Tasking Staff (MTS)
  • మొత్తం ఖాళీలు: 714
  • అప్లికేషన్ స్టార్ట్: 17-12-2025
  • లాస్ట్ డేట్: 15-01-2026
  • అర్హత: 10వ తరగతి (Matriculation)
  • సెలక్షన్: CBT (One Tier Exam)
  • జీతం: Pay Level-1 (₹18,000 – ₹56,900)
  • స్థలం: Delhi Govt Departments

ఖాళీల వివరాలు (Short & Clear)

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి వివిధ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 714 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

శాఖఖాళీలు
Excise & Taxes Dept31
Labour Dept93
Drugs Control Dept6
Urban Development Dept9
Public Grievances Dept5
NCC Dept68
Registrar Cooperative Societies23
General Administration Dept99
Lokayukta Office6
Development Dept231
Food & Supplies Dept140
Sahitya Kala Parishad3
మొత్తం714

Also Read : IITB Non Teaching Recruitment 2025 | “IIT భువనేశ్వర్‌లో భారీ ఉద్యోగాలు – 101 నాన్–టీచింగ్ ఉద్యోగాలు

అర్హతలు (Eligibility)

DSSSB MTS Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి పాసైతే చాలు అప్లయ్ చేసుకోవచ్చు. అన్ని శాఖలకు కూడా ఇవే అర్హతలు వర్తిస్తాయి. 

వయోపరిమితి (Age Limit)

DSSSB MTS Recruitment 2025 అభ్యర్థులకు సాధారణంగా 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

 అప్లికేషన్ ఫీజు (Application Fee)

DSSSB MTS Recruitment 2025 అభ్యర్థులు SBI e-pay ద్వారా ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • UR, OBC, EWS : రూ.100/-
  • Women, SC, ST, PwBD, Ex-Servicemen : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ (Selection Process)

DSSSB MTS Recruitment 2025 అభ్యర్థులకు కేవలం ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు జాబ్ అనేది ఇస్తారు. 

 One Tier CBT Exam

  • మొత్తం ప్రశ్నలు: 200
  • మార్కులు: 200
  • నెగెటివ్ మార్కింగ్: –0.25
  • సెక్షన్లు:
    1. General Awareness
    2. Reasoning
    3. Numerical Ability
    4. Hindi Language
    5. English Language

జీతం వివరాలు (Salary Details)

DSSSB MTS Recruitment 2025 సెలెక్ట్ అయిన వారికి  Pay Level-1 ప్రకారం ₹18,000 – ₹56,900/- వరకు జీతం ఇస్తారు. ఇవి  Group C, Non-Gazetted పోస్టులు. 

దరఖాస్తు విధానం (How to Apply?)

DSSSB MTS Recruitment 2025 అభ్యర్థుల అధికారిక వెబ్ సైట్ ద్వాారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  1. https://dsssbonline.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
  2. ముందు Registration చేయాలి (ఒక్కసారి మాత్రమే).
  3. Login అయ్యి మీ పోస్టుకు సంబంధించి అప్లై చేయండి.
  4. Required details & documents అప్‌లోడ్ చేయండి.
  5. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  6. ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ స్టార్ట్ : 17 Dec 2025 
  • లాస్ట్ డేట్ : 15 Jan 2026
NotificationClick here
Apply OnlineClick here

Also Read : CSIR–NCL Technical Recruitment 2025 | Technician & Technical Assistant పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Leave a Comment

Follow Google News
error: Content is protected !!