Railway RRB Calendar 2026 : భారత రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి పెద్ద అప్‌డేట్ వచ్చింది! Railway Recruitment Board (RRB) 2026-27 కోసం RRB Recruitment Calendar ను అధికారికంగా విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో Assistant Loco Pilot (ALP), Technician, NTPC, Junior Engineer (JE), Paramedical, Section Controller, Group D వంటి ప్రధాన రిక్రూట్‌మెంట్లకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ క్యాలెండర్ ద్వారా అభ్యర్థులు తమ ఎగ్జామ్ ప్రిపరేషన్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ తేదీలు తర్వాత ప్రకటిస్తారు.
Railway RRB Calendar 2026 – తాత్కాలిక షెడ్యూల్
| రిక్రూట్మెంట్ | నోటిఫికేషన్ నెల (2026) |
| Assistant Loco Pilot (ALP) | ఫిబ్రవరి 2026 |
| Technician | మార్చి 2026 |
| Section Controller | ఏప్రిల్ 2026 |
| JE / DMS / CMA | జూలై 2026 |
| Paramedical Categories | జూలై 2026 |
| NTPC (Graduate-Levels 4,5,6) | ఆగస్టు 2026 |
| NTPC (Undergraduate-Levels 2,3) | ఆగస్టు 2026 |
| Ministerial & Isolated Categories | సెప్టెంబర్ 2026 |
| Level-1 (Group D) | అక్టోబర్ 2026 |
ఈ షెడ్యూల్ అధికారికంగా విడుదల అయినది, కానీ తేదీలు మారే అవకాశం ఉంది. ఫైనల్ డేట్స్ అధికారిక CEN కోసం వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
Also Read : Rail Coach Factory Apprentice Recruitment 2025 | రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 550 ఖాళీలు
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
ప్రతి ఉద్యోగ రిక్రూట్‌మెంట్‌కు ప్రత్యేక ఎంపిక విధానం ఉంటుంది.
- అసిస్టెంట్ లోకో పైలట్ : CBT పరీక్షలు, డాక్యూమెంట్ వెరిఫికేషన్
- Technician / JE / NTPC: CBT (రాత పరీక్ష) + స్క్రీనింగ్ + ఇంటర్వ్యూ/డాక్యుమెంట్ వెరిఫికేషన్
- Group D (Level-1): CBT + PET (Physcial Efficiency Test)
- Paramedical / Ministerial: CBT + డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఇవి తాత్కాలిక సూచనలు మాత్తమే. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.
ఎందుకు RRB క్యాలెండర్ 2026 ముఖ్యం?
- అభ్యర్థులు ముందుగానే స్టడీ ప్లాన్ తీయగలరు.
- ఎప్పుడూ పరీక్షలు వస్తాయన్న ఊహాగానము తగ్గుతాయి.
- ఒకే సమయంలో బహుళ రిక్రూట్‌మెంట్‌లకు సమయాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
- గత సంవత్సరాల ట్రెండ్ ప్రకారం ప్రిపరేషన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తారు.
2026 RRB Exams కోసం Nodal RRBs
ప్రతి కేటగిరీకి ప్రత్యేకంగా నోడల్ RRB నియమించబడింది, ఇది ఆ నోటిఫికేషన్‌ను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది.
- ALP – RRB Jammu
- Technicians – RRB Thiruvananthapuram
- JE / DMS / CMA – RRB Bhubaneswar
- NTPC (Graduate) – RRB Prayagraj
- NTPC (Undergraduate) – RRB Ahmedabad
- Paramedical – RRB Bilaspur
- Level-1 (Group D) – RRB Chandigarh
- Ministerial & Isolated – RRB Guwahati
- Section Controller – RRB Mumbai
అభ్యర్థులకు దీని ప్రయోజనం ఏమిటి?
RRB Calendar 2026 ద్వారా రైల్వేలో ఉద్యోగాల ప్రక్రియ సంవత్సరమంతా ఎలా సాగుతుందో ముందుగానే తెలుస్తుంది. ALP కు ఫిబ్రవరిలో, Technician కు మార్చిలో, JE/NTPC కు మధ్య సంవత్సరం, Group D కు చివరిలో. అభ్యర్థులు ఈ షెడ్యూల్‌ను ఉపయోగించి పరీక్షలకు సిద్ధం కావడానికి ప్లాన్ చేసుకోవాలి.
- ముందే ప్లాన్ చేసుకునే అవకాశం
- ఏ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో అంచనా
- సిలబస్ పూర్తి చేయడానికి సరైన టైమ్ మేనేజ్‌మెంట్
- ఎక్కువ పోటీ ఉన్న పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం
Also Read : RRC NR Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్