UPSC NDA 2026 Notification |  ఇంటర్ తర్వాత డైరెక్ట్‌గా ఆఫీసర్ ఉద్యోగం – 394 పోస్టులు

UPSC NDA 2026 Notification : దేశ రక్షణ రంగంలో కెరీర్ కోసం ఎదురుచూస్తు్న్న విద్యార్థులకు భారీ అవకాశం వచ్చింది. UPSC నుండి NDA & NA (I) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో కలిపి 394 ఖాళీల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 12, 2026న దేశవ్యాప్తంగా పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు (Vacancy Details)

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 394 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 1) National Defence Academy (NDA) – 370 పోస్టులు

Wing / Branchపురుషులుమహిళలుమొత్తం
Army Wing19810208
Navy Wing37542
Air Force – Flying90292
Air Force – Ground Tech (Tech.)16218
Air Force – Ground (Non-Tech.)8210

2) Naval Academy (10+2 Cadet Entry Scheme) – 24 పోస్టులు

Entry Schemeపురుషులుమహిళలుమొత్తం
10+2 Cadet Entry (B.Tech)21324

Also Read : UPSC CDS-I 2026 Notification | ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో బంపర్ జాబ్స్

అర్హతలు (Eligibility)

UPSC NDA 2026 Notification అభ్యర్థులు భారతీయ పౌరుడై ఉండాలి. అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

Army Wing

  •  10+2 / ఇంటర్ పాస్

Navy & Air Force / Naval Academy

  •  10+2 లో Physics + Maths తప్పనిసరి

వయోపరిమితి (Age Limit)

UPSC NDA 2026 Notification 01 జూలై 2007 – 01 జూలై 2010 మధ్య జననం ఉండాలి. అవివాహిత పురుషులు, మహిళలు ఇద్దరూ అర్హులు.

అప్లికేషన్ ఫీజు (Application Fee)

UPSC NDA 2026 Notification అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చల్లించాలి. 

  • జనరల్ అభ్యర్థులు : ₹100
  • SC/ST, మహిళలు, JCOs/NCOs/ORs వార్డులకు ఫీజు లేదు.

ఫీజు చెల్లింపు విధానం: డెబిట్/క్రెడిట్ కార్డ్, UPI, నెట్ బ్యాంకింగ్

ఎంపిక ప్రక్రియ (Selection Process)

UPSC NDA 2026 Notification అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

1.రాత పరీక్ష – 900 మార్కులు

  • గణితం – 300 మార్కులు
  • జనరల్ ఎబిలిటీ టెస్ట్ (GAT) – 600 మార్కులు

2. SSB ఇంటర్వ్యూ – 900 మార్కులు

  • ఇంటెలిజెన్స్ టెస్ట్
  • సైకాలజికల్ టెస్ట్
  • గ్రూప్ టాస్క్‌లు
  • ఇంటర్వ్యూ

ఎయిర్ ఫోర్స్ కోసం CPSS (Pilot Aptitude Test) తప్పనిసరి.

ఫిజికల్ స్టాండర్డ్స్ 

ఎత్తు (Height)

  • పురుషులు: కనీసం 157 సెం.మీ
  • మహిళలు: కనీసం 152 సెం.మీ
  • ఫ్లయింగ్ బ్రాంచ్: 163 సెం.మీ (Male & Female)

జీతం & ట్రైనింగ్ ప్రయోజనాలు (Salary & Benefits)

PDF లో స్టైపెండ్/సాలరీ వివరాలు లేకపోయినా NDA/NA క్యాడెట్లకు సాధారణంగా:

  • ట్రైనింగ్ సమయంలో స్థిర స్టైపెండ్
  • ట్రైనింగ్ పూర్తయ్యాక ఆఫీసర్ ర్యాంక్‌తో మంచి పేస్కేల్
  • ఉచిత మెస్, వసతి, యూనిఫాం, మెడికల్ సదుపాయాలు

దరఖాస్తు విధానం (How to Apply)

UPSC NDA 2026 Notification అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  1. UPSC వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://upsconline.nic.in
  2. Account Creation → URN Registration → CAF Form → NDA Exam Module వంతులుగా ఫారమ్ నింపాలి.
  3. లైవ్ ఫోటో క్యాప్చర్ తప్పనిసరి.
  4. సెంటర్ ఎంపికలో ముందే అప్లై చేస్తే ప్రిఫర్డ్ సెంటర్ పొందే అవకాశం ఎక్కువ.

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 10-12-2025
  • చివరి తేదీ: 30-12-2025 (6 PM)
  • పరీక్ష తేదీ: 12-04-2026
NotificationClick here
Apply OnlineClick here

Also Read : Rail Coach Factory Apprentice Recruitment 2025 | రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 550 ఖాళీలు

Leave a Comment

Follow Google News
error: Content is protected !!