BDL Apprentice Recruitment 2025 | భారత్ డైనమిక్స్ లో 156 ఖాళీలు – వెంటనే అప్లయ్ చేయండి

BDL Apprentice Recruitment 2025 : భారత్ డైనమిక్స్ లిమిటెడ్–హైదరాబాద్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 156 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలో ట్రైనింగ్ అవకాశం కావడంతో 10th + ITI పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

ఖాళీల వివరాలు : 

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ. ఈ సంస్థలో అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ ట్రేడ్స్ లో మొత్తం 156 ఖాళీలు ఉన్నాయి.

  • Fitter – 70
  • Electrician – 10
  • Electronics Mechanic – 30
  • Machinist – 15
  • Machinist Grinder – 2
  • Mechanic Diesel – 5
  • Mechanic R & AC – 5
  • Turner – 15
  • Welder – 4

Also Read : IAF AFCAT 01/2026 Notification | ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ పోస్టులు

అర్హతలు :  

BDL Apprentice Recruitment 2025 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసై ఉండాలి. 

వయోపరిమితి : 

BDL Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 14 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

BDL Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ:

BDL Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. 10వ తరగతిలో వచ్చిన మార్కులు మరియు ఐటీఐలో వచ్చిన మార్కులకు సమాన వెయిటేజ్ ఉంటుంది. ప్రతి ట్రేడ్ కు వేర్వేరు మెరిట్ లిస్టులు తయారు చేస్తారు. 

జీతం వివరాలు : 

BDL Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు సెంట్రల్ అప్రెంటిస్ షిప్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

BDL Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసి హార్డ్ కాపీ పంపాల్సి ఉంటుంది. 

  • ముందుగా అభ్యర్థులు apprenticeshipindia.gov.in  లో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • “Establishment Search” → Bharat Dynamics Limited, Kanchanbagh (Reg.No: E05203600393) ఎంపిక చేయాలి.
  • 10th, ITI సర్టిఫికేట్లు, మార్క్‌లిస్ట్ కలర్ స్కాన్ కాపీలు అప్‌లోడ్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి. 

హార్డ్ కాపీ : డౌన్ లోడ్ చేసుకున్న రిజిస్ట్రేషన కాపీతో పాటు 10వ తరగతి, ఐటీఐ సర్టిఫికెట్లు మరియు కులధ్రువీకరణ పత్రం(ఉన్నవారు) సర్టిఫికెట్లను కింది అడ్రస్ కి పంపాలి. 

పంపాల్సిన అడ్రస్ : 

Manager (HR) Apprentice Cell,

Bharat Dynamics Limited,

Kanchanbagh, Hyderabad – 500 058

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 8 డిసెంబర్, 2025
  • హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ : 12 డిసెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : MSTC Management Trainee Recruitment 2025 | భారీ జీతంతో పర్మనెంట్ జాబ్స్

FAQs 

1) ఇది ప్రభుత్వ సంస్థా?

అవును, BDL పూర్తిగా భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన PSU.

2) ఇతర రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయొచ్చా?

అవును, ఎవరైనా భారతీయ అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

3) ఏమైనా ఎగ్జామ్ ఉందా?

లేదు, ఎంపిక మొత్తం మెరిట్ మార్కుల ఆధారంగా.

4) ట్రైనింగ్ ఎంతకాలం ఉంటుంది?

1 సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది.

Leave a Comment

Follow Google News
error: Content is protected !!