AP Job Calendar 2025 : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఇది పండుగ లాంటి వార్తే.. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు లక్ష ఉద్యోగాలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ అయితే సిద్ధం చేస్తోంది. అందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సమాచారాన్ని సేకరించే పనిలో ఉంది. ఆ వివరాలను సేకరించిన తర్వాత HRMS పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. మరి ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : Indian Army Sports Quota Recruitment 2025 | క్రీడాకారులకు ఆర్మీలో బంపర్ జాబ్స్
ఏ శాఖలో – ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
AP Job Calendar 2025 ఏపీ ప్రభుత్వం మొత్తం 99 వేల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. వీటిలో వివిధ శాఖల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 24 విభాగాల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలపై క్లారిటీ రావాలి. 21 శాఖల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ పక్రియ పూర్తి అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు వస్తాయి.
- రెవెన్యూ శాఖలో 2,500 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.
- పంచాయతీరాజ్ శాఖలో 26,000 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- పట్టణాభివృద్ధి శాఖలో 23,000 ఉన్నాయి.
- ఉన్నత విద్యలో 7 వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- స్కిల్ డెవల్మెంట్ శాఖలో 2,600 పోస్టులు ఉన్నాయి.
- వ్యవసాయ శాఖలో 2,400 ఖాళీలు ఉన్నాయి.
- మహిళా, శిశు సంక్షేమ శాఖలో 1,820 ఖాళీలు ఉన్నాయి.
రెడీగా ఉండండి:
AP Job Calendar 2025 అంతేకాదు.. మరికొన్ని విభాగాల్లో కూడా ఖాళీలు ఉన్నాయని, వీటన్నింటినీ సేకరించిన తర్వాత జాబ్ కేలండర్ విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యే నిరుద్యోగులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. జాబ్ క్యాలెండర్ విడుదలయ్యాక స్టార్ట్ చేద్దాం అని కూర్చోకండి.
ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఆ పోటీలో మనం కూడా ఉండాలంటే ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పటి నుంచే మొదలుపెట్టేయాలి. అయితే ఏ పోస్టుకు ఏం అర్హతలు ఉంటాయో జాబ్ క్యాలెండర్ విడుదలయ్యాకే తెలుస్తోంది. చాలా వరకు ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉండవచ్చు. ఉన్నత విద్యలో డీఎడ్, బీఈడీ అర్హతలు ఉంటాయి.
Also Read : Cabinet Secretariat DFO Recruitment 2025 | క్యాబినెట్ సెక్రటేరియట్ లో బంపర్ జాబ్స్ – 250 పోస్టులు