Cabinet Secretariat DFO Recruitment 2025 | క్యాబినెట్ సెక్రటేరియట్ లో బంపర్ జాబ్స్ – 250 పోస్టులు

Cabinet Secretariat DFO Recruitment 2025 : భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి ఓ బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్(టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోరుకుంటున్న ఇంజనీరింగ్ మరియు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇలాంటి సంస్థలో జాబ్ కొడితే లైఫ్ సెట్ అయినట్లే. గేట్ 2023, 2024, 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 14వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. 

Overview

  • సంస్థ పేరు : క్యాబినెట్ సెక్రటేరియట్, భారత ప్రభుత్వం
  • పోస్టు పేరు : డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్(టెక్నికల్)
  • పోస్టుల సంఖ్య : 250
  • చివరి తేదీ : 14 డిసెంబర్, 2025
  • ఎంపిక : గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ
  • దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
Cabinet Secretariat DFO Recruitment 2025

Vacancy Details

Cabinet Secretariat DFO Recruitment 2025 భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ లో జాబ్ కోరుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి చాలా మంచి పోస్టులు అర్హత ఉన్న వారు తప్పకుండా అప్లయ్ చేసుకోండి. మిస్ చేసుకోవద్దు. 

పోస్టు పేరు : డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్స్(DFO) – టెక్నికల్ : 250 పోస్టులు

  • కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : 124
  • డేటా సైన్స్ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ : 10
  • ఎలక్ట్రానిక్స్ అండ్  కమ్యూనికేషన్ :95
  • సివిల్ ఇంజనీరింగ్ : 2
  • మెకానికల్ ఇంజనీరింగ్ : 2
  • ఫిజిక్స్ : 6
  • కెమిస్ట్రీ : 4
  • మ్యాథ్స్ : 2
  • స్టాటిస్టిక్స్ : 2
  • జియాలజీ : 3

Also Read : AIIMS CRE-4 Recruitment 2025 | ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్ – 1386 Group-B & C పోస్టులు

Eligibility 

Cabinet Secretariat DFO Recruitment 2025 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ(B.tech) / సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ(ఎంఎస్సీ) ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు 2023, 2024 మరియు 2025 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి. 

Age Limit : 

Cabinet Secretariat DFO Recruitment 2025 అభ్యర్థులకు 14.12.2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

Application Fee : 

Cabinet Secretariat DFO Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

Selection Process

Cabinet Secretariat DFO Recruitment 2025  క్యాబినెట్ సెక్రటేరియట్ లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

Salary : 

డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లో లెవల్-7 ప్రకారం రూ.44,000 నుంచి రూ.1,42,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీలో అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు సుమారు రూ.99,000/- జీతం అందుతుంది. 

How to Apply

Cabinet Secretariat DFO Recruitment 2025 అభ్యర్థులు ముందుగా అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. A4 కాగితంపై ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ తో అప్లికేషన్ ఫారమ్ టైప్ చేయండి. ఆ అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపండి. ఇటీవలి పాస్ పోర్ట్ సైజ ఫోటోను పేరు మరియు పుట్టిన తేదీ వెనుక అతికించండి. అవసరమైన పత్రాల స్వీయధ్రువీకరించిన కాపీలను జత చేయండి. అందుబాటులో ఉన్న ఎంపికల నుంచి ఒక ఇంటర్వ్యూ కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. గడువుకు ముందే పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ని కింది అడ్రస్ కి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపండి.

అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ : 

Post Bag No. 001,

Lodhi Road Head Post Office,

New Delhi – 110003

Important Dates

  • Application Start Date: 15.11.2025
  • Last Date to Apply: 14.12.2025
NotificationClick here

Also Read : 2025లో High Salary వచ్చే Top Courses | Students కోసం Best List

1 thought on “Cabinet Secretariat DFO Recruitment 2025 | క్యాబినెట్ సెక్రటేరియట్ లో బంపర్ జాబ్స్ – 250 పోస్టులు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!