CWC Recruitment 2025 : సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ (రాజ్ భాష) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ | 16 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్(రాజ్ భాష) | 06 |
మొత్తం | 22 |
Also Read : BRO Jobs 2025 Notification | రోడ్స్ ఆర్గనైజేషన్ లో బంపర్ జాబ్స్ – 542 ఖాళీలు
అర్హతలు :
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ :
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
- ఆఫీస్ మేనేజ్మెంట మరియు సెక్రటేరియల్ ప్రాక్టీస్ లో ఒక సంవత్సరం కోర్సు చేసి ఉండాలి. ఇంగ్లీష్ లో 80 పదాలు షార్ట్ హ్యాంగ్ వేగం మరియు 40 పదాల టైపింగ్ స్పీడ్ ఉండాలి.
జూనియర్ ఎగ్జిక్యూటివ్(రాజ్ భాష) :
- హిందీని ఎలెక్టివ్ సబ్జెక్టుగా మరియు ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్టుగా తీసుకొని గ్రాడ్యుయేట్ లేదా హిందీలో బీఏకి సమానమైన డిగ్రీ / డిప్లొమా
వయోపరిమితి :
అభ్యర్థులకు 15 నవంబర్, 2025 నాటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.1,350/-
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు / పీడబ్ల్యూడీ / ఎక్స్ సర్వీస్ మెన్ : రూ.500/-
- ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాలి
ఎంపిక ప్రక్రియ:
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్(జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : Oppo Find X9 Series Launch date – 200MP Camera & Massive 7500mAh Battery – Power Meets Style!
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు రూ.29,000 – రూ.93,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : ONGC Apprentice Recruitment 2025 | ONGC భారీ నోటిఫికేషన్ – 2,623 ఖాళీలు
3 thoughts on “CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో జాబ్స్”