ONGC Apprentice Recruitment 2025 : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. వివిధ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ట్రేడ్స్ లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2,623 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16 తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 25 వర్క్ సెంటర్లలో మొత్తం 2,623 పోస్టులు ఉన్నాయి.
సెక్టార్ వారీగా ఖాళీలు :
- Northern Sector: 165 పోస్టులు
- Mumbai Sector: 569 పోస్టులు
- Western Sector: 856 పోస్టులు
- Eastern Sector: 458 పోస్టులు
- Southern Sector: 322 పోస్టులు
- Central Sector: 253 పోస్టులు
మొత్తం: 2623 Apprentices
ప్రధాన ట్రేడ్స్:
Computer Operator, Electrician, Fitter, Mechanic Diesel, Lab Chemist, Fire Safety Technician, Secretarial Assistant, Accounts Executive, Civil/Mechanical/Electrical Executive మొదలైనవి.
Also read : Oppo Pad 5 Launched With Dimensity 9400+ Power: Big Display, 10,420mAh Battery & 67W Fast Charging
అర్హతలు :
ట్రేడ్ ఆధారంగా అర్హతలు ఇలా ఉంటాయి:
- ITI Apprentices (NAPS): సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత.
- Diploma Apprentices: సంబంధిత బ్రాంచ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా.
- Graduate Apprentices (NATS): సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ (B.A / B.Sc / B.Com / B.E / B.Tech / BBA).
వయోపరిమితి :
అభ్యర్థులు 06.11.2025 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధరాంగా జరుగుతుంది. అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించడం జరుగుతుంది. మార్కులు సమానంగా ఉన్నప్పుడు పెద్ద వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు.
Also Read : DRDO LRDE Apprentice Recruitment 2025 | డీఆర్డీఓలో 105 ఖాళీలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
జీతం వివరాలు :
అప్రెంటిస్ షిప్ కి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : రూ.12,300/-
- డిప్లొమా అప్రెంటిస్ : రూ.10,900/-
- ట్రేడ్ అప్రెంటిస్ (10th/12th) : రూ.8,200/-
- ట్రేడ్ అప్రెంటిస్ (1-year ITI) : రూ.9,600/-
- ట్రేడ్ అప్రెంటిస్ (2-year ITI) : రూ.10,560/-
దరఖాస్తు విధానం :
- ITI ఆధారిత ట్రేడ్ల కోసం NAPS Portal లో రిజిస్ట్రేషన్ చేయాలి.
- Graduate / Diploma Apprentices కోసం NATS Portal లో రిజిస్ట్రేషన్ చేయాలి.
- తర్వాత ONGC Apprentice Portal లో అప్లికేషన్ సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
- అప్లికేషన్ ప్రారంభం : 16 అక్టోబర్, 2025
- దరఖాస్తు చివరి తేదీ : 06 నవంబర్, 2025
NAPS Portal | Click here |
NATS Portal | Click here |
ONGC Apprentice Portal | Click here |
Notification | Click here |
Also Read : ISRO SDSC SHAR Recruitment 2025 | సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో బంపర్ జాబ్స్
2 thoughts on “ONGC Apprentice Recruitment 2025 | ONGC భారీ నోటిఫికేషన్ – 2,623 ఖాళీలు”