By Jahangir

Published On:

Follow Us
EMRS Teaching & Non Teaching Jobs 2025

EMRS Teaching & Non Teaching Jobs 2025 | ఏకలవ్య స్కూల్స్ లో PGT, TGT & నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

EMRS Teaching & Non Teaching Jobs 2025: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) కింద ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 7267 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

EMRS Teaching & Non Teaching Recruitment 2025 Overview

నియామక సంస్థనేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్
పోస్టు పేరుటీచింగ్ మరియు నాన్ టీచింగ్
పోస్టుల సంఖ్య7,267
పరీక్ష పేరుEMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్(ESSE) 2025
దరఖాస్తు ప్రక్రియ19 సెప్టెంబర్ – 23 అక్టోబర్, 2025
దరఖస్తు విధానంఆన్ లైన్ 
జాబ్ లొకేషన్ భారతదేశం అంతటా

ఖాళీల వివరాలు : 

సెంట్రల్ గవర్నెమంట్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న అభ్యర్థుల కోసం ఓ భారీ నోటిఫికేషన్ అయితేే రిలీజ్ అయ్యింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 7,267 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
ప్రిన్సిపాల్225
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(PGT)1,460
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(TGT)3,962
మహిళా స్టాఫ్ నర్స్550
హాస్టల్ వార్డెన్ (పురుషుడు)346
హాస్టల్ వార్డెన్ (మహిళలు)289
అకౌంటెంట్61
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్228
ల్యాబ్ అటెండెంట్146
మొత్తం7,267

Also Read : DSSSB TGT Teacher Recruitment 2025 | 5,346 TGT టీచర్ జాబ్స్.. పూర్తి వివరాలు ఇవిగో..

అర్హతలు : 

EMRS Teaching & Non Teaching Recruitment 2025 టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ మరియు BEd ఉత్తీర్ణత సాధించిలి. మరియు CTET అర్హత తప్పనిసరిగా ఉండాలి. హాస్టల్ వార్డెన్ కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
ప్రిన్సిపాల్మాస్టర్ డిగ్రీ, బీఎడ్. మరియు పీజీటీ లేదా లెక్చరర్ గా 12 సంవత్సరాల అనుభవం
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(PGT)సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ + B.Ed
PGT(కంప్యూటర్ సైన్స్)MSc(కంప్యూటర్ సైన్స్ / ఐటీ) లేదా MCA / ME/M.Tech
TGT(ఇంగ్లీష్ / హిందీ / మ్యాథ్స్ / సైన్స్ / సోషల్ స్టడీస్)సంబంధత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ + BEd + CTET లేదా సంబంధిత సబ్జెక్టులో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ
TGT(Third Language )సంబంధిత లాంగ్వేజ్ ను మెయిన్ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ + B.Ed + CTET
TGT (Music)గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సంగీతంలో బ్యాచిలర్ డిగ్రీ
TGT(Atrs)ఫైన్ ఆర్ట్స్ / క్రాఫ్ట్స్ లో డిగ్రీ లేదా ఫైన్ ఆర్ట్స్ లో B.Ed
TGT(PET)ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ
TGT (లైబ్రేరియన్)లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ లేదా లైబ్రరీ సైన్స్ లో 1 సంవత్సరం డిప్లొమాతో గ్రాడ్యుయేషన్
హాస్టల్ వార్డెన్(పురుషుడు మరియు మహిళలు)ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ
మహళా స్టాఫ్ నర్స్నర్సింగ్ లో బీఎస్సీ(ఆనర్స్) లేదా తత్సమానం, నర్సుగా నమోదు చేసుకొని, 50 పడకల ఆస్పత్రిలో 2.5 సంవత్సరాల అనుభవం
అకౌంటెంట్కామార్స్ లో బీకామ్ డిగ్రీ
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్12వ తరగతి ఉత్తీర్ణత మరియు ఇంగ్లీష్ లో నిమిషనికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. 
ల్యాబ్ అటెండెంట్10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు లాబొరేటరీ టెక్నిక్ లో సర్టిఫికెట్ / డిప్లొమా లేద సైన్స్ స్ట్రీమ్ తో 12వ తరగతి ఉత్తీర్ణత

వయోపరిమితి : 

EMRS Teaching & Non Teaching Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. 

  • ప్రిన్సిపాల్ : 50 సంవత్సరాలు
  • పీజీటీ : 40 సంవత్సరాలు
  • టీజీటీ : 35 సంవత్సరాలు
  • హాస్టల్ వార్డెన్ మరియు స్టాఫ్ నర్స్ : 35 సంవత్సరాలు
  • అకౌంటెంట్, JSA, ల్యాబ్ అటెండెంట్ : 30 సంవత్సరాలు
  • SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

EMRS Teaching & Non Teaching Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరిప్రిన్సిపాల్పీజీటీ మరియు టీజీటీనాన్ టీచింగ్ స్టాఫ్
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్రూ.2,500/-రూ2,000/-రూ.1,500/-
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / మహిళలురూ.500/-రూ.500/-రూ.500/-

ఎంపిక ప్రక్రియ: 

EMRS Teaching & Non Teaching Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్(ESSE) 2025 ఆధారంగా పూర్తిగా పారదర్శకంగా, దశలవారీగా జరుగుతుంది.

  1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT):
    • అన్ని టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులకు మొదట ఆన్‌లైన్ CBT పరీక్ష ఉంటుంది.
    • ప్రశ్నలు ప్రధానంగా General Awareness, Reasoning, English, Quantitative Aptitude, Subject Knowledge మీద ఆధారపడి ఉంటాయి.
    • ఇది Objective Type Questions (MCQs) రూపంలో ఉంటుంది.
    • నెగటివ్ మార్కింగ్ కూడా ఉండే అవకాశం ఉంది.
  2. ఇంటర్వ్యూ (కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే):
    • ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, PGT పోస్టులకు CBTలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
    • అభ్యర్థుల అభ్యాస పద్ధతి, సబ్జెక్ట్‌లో లోతైన అవగాహన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు చూసి మార్కులు కేటాయిస్తారు.
  3. స్కిల్ టెస్ట్ (నాన్-టీచింగ్ పోస్టులకు అవసరమైతే):
    • ఉదాహరణకు: JSA (Junior Secretariat Assistant) కి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్,
    • అకౌంటెంట్ పోస్టుకు ప్రాక్టికల్ అకౌంట్స్ టెస్ట్,
    • ల్యాబ్ అటెండెంట్ కు ల్యాబ్ వర్క్‌పై ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్:
    • CBT/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ పూర్తి చేసిన తరువాత, ఎంపికైన అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు సమర్పించాలి.
    • వయస్సు, విద్యార్హతలు, క్రీడా/అనుభవ సర్టిఫికెట్లు (అవసరమైతే), కుల ధృవీకరణ పత్రాలు మొదలైనవి పరిశీలిస్తారు.
  5. తుది ఎంపిక:
    • అన్ని దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
    • చివరగా దేశవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

 అంటే, అభ్యర్థులు మొదట CBTలో ఉత్తీర్ణులు కావాలి, తరువాత సంబంధిత పోస్టు ప్రకారం ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ దాటాలి. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతే ఎంపిక ఖరారు అవుతుంది.

EMRS పోస్టుల వారీగా రాత పరీక్ష ప్యాటర్న్ (CBT)

పోస్టు పేరుమొత్తం ప్రశ్నలుమొత్తం మార్కులుసమయంప్రధాన అంశాలు
ప్రిన్సిపల్1501503 గంటలుGeneral Awareness, Reasoning, Numerical Ability, General English/Hindi, Administration & School Leadership, Education Policy
వైస్ ప్రిన్సిపల్1501503 గంటలుGeneral Awareness, Reasoning, Numerical Ability, General English/Hindi, Education Management, Child Psychology
PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)1501503 గంటలుGeneral Awareness, Reasoning, Numerical Ability, General English/Hindi, Subject Knowledge (PG Level)
TGT (ట్రెయిన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్)1501503 గంటలుGeneral Awareness, Reasoning, Numerical Ability, General English/Hindi, Subject Knowledge (UG Level)
అకౌంటెంట్1201202.5 గంటలుGeneral Awareness, Reasoning, Numerical Ability, General English/Hindi, Accounts & Finance
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)1201202.5 గంటలుGeneral Awareness, Reasoning, Numerical Ability, General English/Hindi, Basic Computer & Office Skills
ల్యాబ్ అటెండెంట్1201202.5 గంటలుGeneral Awareness, Reasoning, Numerical Ability, General English/Hindi, Science Basics & Lab Knowledge
హాస్టల్ వార్డెన్1201202.5 గంటలుGeneral Awareness, Reasoning, Numerical Ability, General English/Hindi, Child Care & Hostel Management

ముఖ్య గమనికలు:

  • అన్ని పోస్టులకు Objective Type MCQs ఉంటాయి.
  • ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
  • నెగటివ్ మార్కింగ్: తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత.
  • కనీస అర్హత మార్కులు (Qualifying Marks) పోస్టుల వారీగా వేరువేరుగా నిర్ణయిస్తారు.

అంటే అభ్యర్థులు తమ పోస్టుకు సంబంధించిన సబ్జెక్ట్/ప్రత్యేక అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

Also Read : Central University of Karnataka Recruitment 2025 | CUKలో నాన్ టీచింగ్ జాబ్స్

జీతం వివరాలు : 

EMRS Teaching & Non Teaching Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం మ్యాట్రిక్స్ ప్రకారం ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.

  • ప్రిన్సిపల్: ₹78,800 – ₹2,09,200
  • వైస్ ప్రిన్సిపల్: ₹56,100 – ₹1,77,500
  • PGT: ₹47,600 – ₹1,51,100
  • TGT: ₹44,900 – ₹1,42,400
  • నాన్-టీచింగ్ పోస్టులు: ₹18,000 – ₹56,900 (పోస్టు ఆధారంగా) 

దరఖాస్తు విధానం : 

EMRS Teaching & Non Teaching Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ESSE 2025 Online Application పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • స్కాన్ చేసిన పత్రాలు, ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు :: 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 19 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 23 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : CDAC Recruitment 2025: Apply Online for Project Engineer, Executive Director & Latest Vacancies

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Posts

2 thoughts on “EMRS Teaching & Non Teaching Jobs 2025 | ఏకలవ్య స్కూల్స్ లో PGT, TGT & నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!