UPSC ESE 2026 Notification : దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకునే ఇంజినీర్లకు సువర్ణావకాశం! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా Engineering Services Examination (ESE) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 474 పోస్టులు భర్తీ చేస్తున్నారు. రైల్వేలు, డిఫెన్స్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసులు, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ వంటి కీలక ప్రభుత్వ విభాగాల్లో గజెటెడ్ ఆఫీసర్ హోదా పొందే అవకాశాన్ని ఈ నోటిఫికేషన్ అందిస్తోంది. ఇంజినీరింగ్‌లో ప్రతిభ ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖస్తు చేసుకోవచ్చు.

UPSC ESE 2026 Notification Overview
నియామక సంస్థ | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష పేరు | ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ESE 2026 |
పోస్టుల సంఖ్య | 474 |
దరఖస్తు ప్రక్రియ | 26 సెప్టెంబర్ – 16 అక్టోబర్, 2025 |
ప్రిలిమ్స్ ఎగ్జామ్ | 08 ఫిబ్రవరి, 2025 |
Also Read : SAIL SSP Recruitment 2025 | స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లయ్ చేయండి
ఖాళీల వివరాలు (Vacancy Details):
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడదల చేసింది. మొత్తం 474 పోస్టులు ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఖాళీలు నాలుగు ఇంజనీరింగ్ విభాగాల్లో పంపిణీ చేశారు.
కేగటిరీ | ఇంజనీరింగ్ విభాగం |
కేటగిరి-1 | సివిల్ ఇంజనీరింగ్ |
కేటగిరి-2 | మెకానికల్ ఇంజనీరింగ్ |
కేటగిరి-3 | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ |
కేటగిరి-4 | ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ |
అర్హతలు (Eligibility):
UPSC ESE 2026 Notification అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి.
- Institution of Engineers (India) A & B సెక్షన్లు పాసైన వారు కూడా అర్హులు.
- కొన్నిసర్వీసులకు M.Sc. (Electronics/Physics/Telecom) అర్హత కూడా అనుమతించబడుతుంది.
వయోపరిమితి(Age Limit) :
UPSC ESE 2026 Notification అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవతవ్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fees):
UPSC ESE 2026 Notification అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్/OBC/EWS: ₹200/-
- SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
ఎంపిక విధానం (Selection Process):
UPSC ESE 2026 Notification అభ్యర్థుల ఎంపిక 3 దశల్లో జరుగుతుంది.
- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టైప్)
- మెయిన్ ఎగ్జామినేషన్ (కన్వెన్షనల్ పేపర్స్)
- పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ
Also Read : NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 | రోడ్డు రవాణా శాఖలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్
జీతం వివరాలు (Salary Details):
UPSC ESE 2026 Notification UPSC ద్వారా ఎంపికైన అభ్యర్థులు Group-A Gazetted Officer హోదాలో చేరతారు. ప్రాథమిక జీతం సుమారు ₹56,100/- (7th CPC) + అలవెన్సులు లభిస్తాయి. మొత్తంగా ₹80,000 – ₹1,00,000 వరకు జీతం పొందవచ్చు.
దరఖాస్తు విధానం (How to Apply):
UPSC ESE 2026 Notification అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
- అభ్యర్థులు www.upsconline.nic.in వెబ్‌సైట్ ని సందర్శించాలి.
- ముందుగా యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 26 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 16 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : SSC CPO Notification 2025 | 3,073 SI పోస్టులకు బంపర్ నోటిఫికేషన్