SSC CPO Notification 2025 : దేశ సేవలో భాగం కావాలనుకునే యువతకు ఇది గొప్ప అవకాశం. Staff Selection Commission (SSC) తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా Delhi Police మరియు Central Armed Police Forces (CAPFs) లో Sub-Inspector (SI) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 3,073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. స్థిరమైన జీతం, భవిష్యత్తులో పదోన్నతుల అవకాశాలు, మరియు దేశ రక్షణలో భాగమయ్యే గౌరవం — ఇవన్నీ కలిపి ఈ ఉద్యోగాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC CPO Notification 2025 Overview
నియామక సంస్థ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) |
పోస్టు పేరు | ఢిల్లీ పోలీస్ మరియు CAPF లలో సబ్ ఇన్ స్పెక్టర్ |
పోస్టుల సంఖ్య | 3,073 |
దరఖాస్తు ప్రక్రియ | 26 సెప్టెంబర్ – 16 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : SSC Delhi Police Constable Driver recruitment 2025 | 737 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్
Vacancy Details :
Delhi Police మరియు Central Armed Police Forces (CAPFs) లో Sub-Inspector (SI) పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ఢిల్లీ పోలీస్ SI (పురుషుడు) | 142 |
ఢిల్లీ పోలీస్ SI (మహిళలు) | 70 |
CAPF SI (GD) | 2861 |
Eligibility :
SSC CPO Notification 2025 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణఉలై ఉండాలి.
- అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- Delhi Police-లోకి సెట్ చేయబోయే మగ అభ్యర్థులకు LMV (Car & Motorcycle) Driving License నిర్దిష్ట దశలో (PE&MT-కు) ఉండాలి; లేకపోతే వారు CAPFs కోసం మాత్రమే పరిగణించే అవకాశం ఉంది.
Age Limit :
SSC CPO Notification 2025 అభ్యర్థులకు 01.08.2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
Application Fees :
SSC CPO Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / EWS : రూ.100/-
- SC / ST / ExSm / Women : ఫీజు లేదు
Selection Process:
SSC CPO Notification 2025 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- Paper-I (Computer Based Exam)
- PST / PET (Physical Standards & Endurance Tests)
- Paper-II (Computer Based Exam)
- Detailed Medical Examination (DME / RME)
- Document Verification (DV) & Final Merit
hysical Standards (శారీరక ప్రమాణాలు)
Height (ఎత్తు):
- పురుషులు: 170 సెం.మీ.
- మహిళలు: 157 సెం.మీ.
Chest (ఛాతి కొలత – పురుషులకు మాత్రమే):
- కనీసం 80 సెం.మీ.
- ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.
Weight (బరువు):
- ఎత్తు, వయస్సుకు తగినంతగా ఉండాలి.
PET – Physical Endurance Test (ఫిజికల్ టెస్ట్)
పురుషుల కోసం:
- 100 మీటర్లు పరుగెత్తాలి – 16 సెకన్లలోపు
- 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి – 6.5 నిమిషాల్లో
- లాంగ్ జంప్ – 3.65 మీటర్లు (3 అవకాశాలు)
- హై జంప్ – 1.2 మీటర్లు (3 అవకాశాలు)
- షాట్పుట్ (16 పౌండ్లు) – 4.5 మీటర్లు (3 అవకాశాలు)
మహిళల కోసం:
- 100 మీటర్లు పరుగెత్తాలి – 18 సెకన్లలోపు
- 800 మీటర్లు పరుగెత్తాలి – 4 నిమిషాల్లో
- లాంగ్ జంప్ – 2.7 మీటర్లు (3 అవకాశాలు)
- హై జంప్ – 0.9 మీటర్లు (3 అవకాశాలు)
(PET పూర్తిగా క్వాలిఫైయింగ్ మాత్రమే — అంటే, మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది; మార్కులు ఇవ్వరు)
Medical Standards (వైద్య ప్రమాణాలు)
- Eyesight (కళ్ళ చూపు): 6/6 మరియు 6/9 ఉండాలి. కళ్లజోడు / కాంటాక్ట్ లెన్స్ వాడొచ్చు కానీ విజన్ నిబంధనలకు సరిపోవాలి.
- Colour Vision: సరిగ్గా ఉండాలి (రంగులు గుర్తించగలగాలి).
- శరీర లోపాలు ఉండకూడదు: ఉదాహరణకు knock-knee, flat foot, squint వంటివి ఉండకూడదు.
- టాటూలు: కొన్ని చిన్న టాటూలు మాత్రమే అనుమతించబడతాయి (ప్రత్యేక షరతులు ఉంటాయి).
- ఆరోగ్యం: అభ్యర్థి పూర్తిగా ఆరోగ్యంగా, శారీరకంగా బలంగా ఉండాలి.
Also Read : SSC Delhi Police Head Constable Notification 2025 | 552 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
Salary (Pay Scale):
SSC CPO Notification 2025 Delhi Police మరియు Central Armed Police Forces (CAPFs) లో Sub-Inspector (SI) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-6 ప్రకారం రూ.35,400 – రూ.1,12,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
How to Apply :
SSC CPO Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిక్రూట్మెంట్ విభాగంలో వెళ్లి One-Time Registration (OTR) ప్రక్రియ పూర్తి చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫారంలో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
Important Dates :
- దరఖస్తు ప్రారంభ తేదీ : 26 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 16 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 | SSC భారీ నోటిఫికేషన్ – 7,565 పోస్టులు భర్తీ