ISRO VSSC Driver Notification 2025 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) – విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(VSSC) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది పాత నోటిఫికేషన్ అయినప్పటికీ డ్రైవర్ మరియు కుక్ పోస్టుల ఖాళీలను పెంచారు. దీంతో ఈ దరఖాస్తు విండో మళ్లీ ఓపెన్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్(రాజ్ భాష), లైట్ వెహికల్ డ్రైవర్-ఎ, హెవీ వెహికల్ డ్రైవర్-ఎ, ఫైర్ మ్యాన్-ఎ మరియు కుక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ISRO VSSC Driver Notification 2025 Overview
నియామక సంస్థ | ఇస్రో – విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ |
పోస్టుల పేర్లు | అసిస్టెంట్(రాజ్ భాష), లైట్ వెహికల్ డ్రైవర్-ఎ, హెవీ వెహికల్ డ్రైవర్-ఎ, ఫైర్ మ్యాన్-ఎ మరియు కుక్ |
పోస్టుల సంఖ్య | 39 |
దరఖాస్తు ప్రక్రియ | 24 సెప్టెంబర్ – 8 అక్టోబర్, 2025 (రీఓపెన్) |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Posts & Vacancies Details:
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అసిస్టెంట్(రాజ్ భాష), లైట్ వెహికల్ డ్రైవర్-ఎ, హెవీ వెహికల్ డ్రైవర్-ఎ, ఫైర్ మ్యాన్-ఎ మరియు కుక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డ్రైవర్ మరియు కుక్ పోస్టుల ఖాళీలను పెంచారు. దీంతో ఈ దరఖాస్తు విండో మళ్లీ ఓపెన్ చేశారు. మొత్తం 39 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సవరించిన ఖాళీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
అసిస్టెంట్ (రాజ్ భాష) | 02 |
లైట్ వెహికల్ డ్రైవర్ – ఎ | 27 |
హెవీ వెహికల్ డ్రైవర్ – ఎ | 05 |
ఫైర్ మ్యాన్ – ఎ | 03 |
కుక్ | 02 |
మొత్తం | 39 |
Also Read : ఇస్రోలో భారీ జీతంతో సైంటిస్ట్ / ఇంజనీర్ ఉద్యోగాలు
Eligibility Criteria :
ISRO VSSC Driver Notification 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. వివరాలు కింద ఉన్నాయి.
Assistant (Rajbhasha)
- డిగ్రీ (Graduation) కనీసం 60% మార్కులతో.
- హిందీ టైపింగ్ స్కిల్ – 25 wpm కంప్యూటర్లో.
- కంప్యూటర్ ప్రావీణ్యం.
Light Vehicle Driver-A
- SSLC/10th ఉత్తీర్ణత.
- Light Vehicle Driving License (LVD) కావాలి.
- కనీసం 3 సంవత్సరాల అనుభవం.
Heavy Vehicle Driver-A
- SSLC/10th ఉత్తీర్ణత.
- Heavy Vehicle Driving License (HVD) కావాలి.
- 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం (అదిలో కనీసం 3 సంవత్సరాలు హెవీ వాహనాల్లో).
- మోటార్ మెకానిజం మరియు పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ – జాయినింగ్ తర్వాత 3 నెలల్లో పొందాలి.
Fireman-A
- SSLC/10th ఉత్తీర్ణత.
- ఫిజికల్ స్టాండర్డ్స్ (ఎత్తు, ఛెస్ట్, విజన్, ఎండ్యూరెన్స్) పాటించాలి.
Cook
- SSLC/10th ఉత్తీర్ణత.
- కనీసం 5 సంవత్సరాల అనుభవం రెప్యూటెడ్ హోటల్ లేదా కాన్టీన్లో.
Age Limit (as on 15.04.2025):
- Assistant (Rajbhasha): 18 – 28 సంవత్సరాలు
- Drivers (LVD/HVD): 18 – 35 సంవత్సరాలు
- Fireman-A: 18 – 25 సంవత్సరాలు
- Cook: 18 – 35 సంవత్సరాలు
- SC/ST/OBC/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
Application Fee :
ISRO VSSC Driver Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General/OBC/EWS: ₹100/-
- Women/SC/ST/PwBD/Ex-Servicemen: ఫీజు లేదు
Selection Process :
ISRO VSSC Driver Notification 2025 పోస్టులను బట్టి ఎంపిక ప్రక్రియ మారుతుంది. అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో ఉంటుంది.
- Assistant (Rajbhasha): Written Test + Typing Skill Test
- Drivers (LVD/HVD): Written Test + Driving Test
- Fireman-A: Physical Efficiency Test + Written Test
- Cook: Written Test + Trade Test (Practical Cooking)
Also Read : భారత్ ఎలక్ట్రానిక్స్ లో బంపర్ నోటిఫికేషన్..లిమిటెడ్ టైమ్ అప్లై
Salary / Pay Scale:
ISRO VSSC Driver Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Assistant (Rajbhasha): ₹25,500 – ₹81,100 (Level-04)
- Drivers, Fireman, Cook: ₹19,900 – ₹63,200 (Level-02)
- అదనంగా HRA, Transport Allowance, DA, Medical Facilities, NPS మరియు ఇతర ISRO perks లభిస్తాయి.
How to Apply:
ISRO VSSC Driver Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు ISRO Official Website కి వెళ్లాలి.
- Career → VSSC → Advt. No. VSSC-332 క్లిక్ చేయండి.
- అప్లికేషన్ ఫారంలో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, ఫోటో, సైన్ అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
Important Dates:
- దరఖాస్తు ప్రారంభ తేదీ (రీఓపెన్) : 24 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 08 అక్టోబర్, 2025
Notification & Apply Online | Click here |
Official Website | Click here |
Also Read : కొచ్చిన్ షిప్ యార్డ్ లో బంపర్ జాబ్స్