NIAB Recruitment 2025 : హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. “Surveillance of avian viruses in poultry farm environment in the neighborhood of BRIC-NIAB of Telangana State” అనే ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ అసోసియేట్-I మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ప్రాజెక్ట్ అసోసియేట్-I : 01
- ల్యాబ్ టెక్నీషియన్ : 01
Also Read : NIOS Recruitment 2025 | రూ.50 వేల జీతంతో ఓపెన్ స్కూల్ లో ఉద్యోగాలు
అర్హతలు :
NIAB Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
ప్రాజెక్ట్ అసోసియేట్-1 :
- నేచురల్ లేదా అగ్రికల్చరల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ (4 సంవత్సరాలు) లేదా మాస్టర్స్ డిగ్రీ / BVSc / B.Pharma / ఇంజినీరింగ్, టెక్నాలజీ లేదా మెడిసిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
- RNA, DNA ఐసోలేషన్స్, PCR, QPCR, క్లోనింగ్ మరియు సెల్ కల్చర్ హ్యాండ్లింగ్‌లో అనుభవం ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ :
- సైన్స్‌లో 12వ తరగతి + డిప్లొమా + 3 సంవత్సరాల ల్యాబ్ అనుభవం, లేదా
- సైన్స్ సంబంధిత సబ్జెక్ట్‌లో 3 సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ.
- మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్‌లో ముందస్తు అనుభవం ఉండడం మంచిది.
వయోపరిమితి :
NIAB Recruitment 2025 అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
NIAB Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
NIAB Recruitment 2025 అభ్యర్థుల విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
Also Read : DRDO SSPL Jobs
జీతం వివరాలు :
ప్రాజెక్ట్ అసోసియేట్-I:
- NET లేదా ఏదైనా నేషనల్ లెవల్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే: ₹37,000 + HRA
- NET లేకపోతే: ₹30,000 + HRA
ల్యాబ్ టెక్నీషియన్: నెలకు ₹20,000 (కన్సాలిడేటెడ్ పే)
ప్రాజెక్ట్ వ్యవధి : ఈ నియామకం 1 సంవత్సరం వరకు ఉంటుంది. పనితీరు ఆధారంగా ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకు పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం :
NIAB Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం : 13 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 03 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also read : ఏకలవ్య స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “NIAB Recruitment 2025 | NIABలో ప్రాజెక్ట్ అసోసియేట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు”