IBPS RRB Notification 2025 : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12,718 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IBPS RRB Notification 2025 Overview
నియామక సంస్థ | ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలక్షన్ |
పోస్టు పేరు | ఆఫీసర్ (స్కేల్ 1,2,3) మరియు ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్సస్) |
ఖాళీల సంఖ్య | 12,718 |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
దరఖాస్తులకు చివరి తేదీ | 28 సెప్టెంబర్, 2025 (పొడిగించబడింది) |
Also Read : HVF Junior Manager Recruitment 2025 | హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో బంపర్ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12,718 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) | 7,472 |
ఆఫీసర్ స్కేల్-1(అసిస్టెంట్ మేనేజర్) | 3,907 |
ఆఫీసర్ స్కేల్-2,3 | 1,339 |
మొత్తం | 12,718 |
అర్హతలు :
IBPS RRB Notification 2025 పోస్టులను బట్టి అభ్యర్థుల విద్యార్హతల వివరాలు మారుతాయి.
- ఆఫీస్ అసిస్టెంట మరియు ఆఫీసర్ స్కేల్-1(అసిస్టెంట్ మేనేజర్) : అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఇతర పోస్టులకు: బ్యాచిలర్ డిగ్రీతో పాటు అనుభవం కూడా ఉండాలి. వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు.
వయోపరిమితి :
IBPS RRB Notification 2025 అభ్యర్థులకు వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది.
- అఫీస్ అసిస్టెంట్ : 18 నుంచి 28 సంవత్సరాలు
- ఆఫీసర్ స్కేల్ – 1 : 18 నుంచి 30 సంవత్సరాలు
- ఆఫీసర్ స్కేల్ – 2 : 21 నుంచి 32 సంవత్సరాలు
- ఆఫీసర్ స్కేల్ – 3 : 21 నుంచి 40 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IBPS RRB Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / EWS : రూ.850/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : రూ.175/-
ఎంపిక ప్రక్రియ :
IBPS RRB Notification 2025 అభ్యర్థుల ఎంపిక పోస్టును బట్టి కింది దశల్లో జరుగుతుంది.
ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు :
- ప్రిలిమినరీ పరీక్ష
- మెయిన్ పరీక్ష
- ఇంటర్వ్యూ(ఆఫీసర్ స్కేల్-1 కి మాత్రమే)
ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టులకు :
- సింగిల్ లెవల్ ఎగ్జామ్
- ఇంటర్వ్యూ
Also Read : DRDO SSPL Recruitment 2025 | MTS & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
IBPS RRB Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.35,000 – రూ.40,000/- వరకు, ఆఫీసర్ స్కేల్-1 పోస్టులకు నెలకు రూ.50,000 – రూ.55,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇతర పోస్టులకు నిబంధనల ప్రకారం జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
IBPS RRB Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు IBPS అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో CRP for RRBs-Officer Apply Online లేదా CRP for RRBs-Office Assistant Apply Online క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28 సెప్టెంబర్, 2025 (పొడిగించబడింది)
Notification | Click here |
Apply Online | Click here |
Official Website | Click here |
Also Read : NHPC Trainee recruitment 2025 | NHPCలో ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “IBPS RRB Notification 2025 | గ్రామీణ బ్యాంకుల్లో 12 వేల పోస్టులు.. అప్లయ్ చేశారా?”