RRB JE Recruitment 2025 : రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులక గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) Junior Engineer (JE) Recruitment 2025 కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా 2570 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. వీటిలో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ చివరి వారంలో విడుదలయ్యే అవకాశముంది.

RRB JE Recruitment 2025 Overview
వివరాలు | సమాచారం |
రిక్రూట్మెంట్ సంస్థ | Railway Recruitment Board (RRB) |
పోస్టుల పేరు | JE, Depot Material Superintendent, Chemical & Metallurgical Assistant, Chemical/Metallurgical Supervisor |
మొత్తం ఖాళీలు | 2,570 |
ఎంపిక ప్రక్రియ | CBT 1, CBT 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ |
నోటిఫికేషన్ తేదీ | సెప్టెంబర్ 2025 (Expected) |
రిజిస్ట్రేషన్ తేదీలు | త్వరలో ప్రకటిస్తారు |
Also Read : RRC NCR Apprentice Recruitment 2025 | రైల్వే శాఖలో మరో భారీ నోటిఫికేషన్ – 1763 ఖాళీలు
పోస్టుల వివరాలు :
ఈ రిక్రూట్‌మెంట్‌లో ప్రధానంగా దిగువ పోస్టులు ఉంటాయి. Junior Engineer (Safety & Non-Safety), Depot Material Superintendent (DMS), Chemical & Metallurgical Assistant, అలాగే Chemical/Metallurgical Supervisor వంటి ఇతర సాంకేతిక/సూపర్వైజరీ పోస్టులు ఉన్నాయి.. మొత్తం 2,570 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు :
RRB JE Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోవాలి.
- Junior Engineer (JE): సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో డిప్లోమా లేదా డిగ్రీ (ప్రత్యేక గ్రేడ్/విషయాల కోసం నోటిఫికేషన్ చూడాలి).
- Depot Material Superintendent (DMS): డిప్లోమా/డిగ్రీ ఇంజనీరింగ్.
- Junior Engineer (IT): PGDCA / B.Sc. (Computer Science) / BCA / B.Tech (CS/IT) / DOEACC B-Level (3 సంవత్సరాలు) వంటి కోర్సులు.
- Chemical & Metallurgical Assistant: Physics & Chemistry తో B.Sc. మరియు సాధారణంగా కనీసం 55% మార్కులు (నోటిఫికేషన్ ఆధారంగా మారవచ్చు).
వయోపరిమితి :
RRB JE Recruitment 2025 వయోపరిమితి, వయోసడలింపు మరియు అధికారిక నిబంధనల కోసం పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తాయి.
ఎంపిక ప్రక్రియ:
RRB JE Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా కింది దశల్లో జరుగుతుంది.
- CBT-1 (Screening) : ప్రాథమిక కంప్యూటర్-బేస్డ్ టెస్ట్.
- CBT-2 (Main/Domain) : టెక్నికల్/డొమైన్ సంబంధించిన ప్రశ్నలు, జాబ్-స్పెసిఫిక్ నోలెడ్జ్.
- Document Verification (DV)
- Medical Examination : రెగ్యులర్ రైల్వే మెడికల్ నార్మ్స్ ప్రకారం.
ప్రతీ దశలో కనీస అర్హత మార్కుల (qualifying marks) ఉంటాయి — అవి ఫైనల్ నోటిఫికేషన్‌లో చెప్పబడతాయి.
Also Read : NRF Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ నోటిఫికేషన్
జీతం వివరాలు :
RRB JE Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు లెవల్-6 ప్రకారం నెలకు రూ.29,300 – రూ.38,400/- వరకు జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
RRB JE Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ (rrbapply.gov.in లేదా సంబంధిత RRB సైట్) లో Registration చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ చేసి అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలి..
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ చెల్లించండి (ఫీజు వివరాలు నోటిఫికేషన్‌లో ఇవ్వబడతాయి).
- ఫారమ్ సమర్పించి, Acknowledgement / PDF ప్రింట్ తీసుకుని భవిష్యత్తులో అవసరానికి సేవ్ చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
Registration / Apply dates అధికారిక నోటిఫికేషన్ లో తర్వాత ప్రకటించబడతాయి. ఆఫీషియల్ నోటిఫికేషన్ సెప్టెంబర్ చివర్లో వచ్చే అవకాశం ఉంది.
Notification | Click here |
Also Read : TGSRTC Driver & Shramik Jobs 2025 | RTCలో 1,743 పోస్టులకు భారీ నోటిఫికేషన్