Punjab & Sind Bank SO Recruitment 2025 | స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

Punjab & Sind Bank SO Recruitment 2025 : భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న Punjab & Sind Bank నుంచి ఒక మంచి ఉద్యోగావకాశం వచ్చింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ – క్రెడిట్ మేనేజర్ మరియు అగ్రికల్చర్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 190 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Punjab & Sind Bank SO Recruitment 2025 Overview

వివరాలుసమాచారం
సంస్థ పేరుPunjab & Sind Bank
పోస్టు పేరుSpecialist Officers (Credit Manager, Agriculture Manager)
స్కేల్MMGS-II
ఖాళీలు190
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం19 సెప్టెంబర్ 2025
చివరి తేదీ10 అక్టోబర్ 2025
వెబ్‌సైట్punjabandsindbank.co.in

Also Read : Bank of Baroda Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్ – జీతం రూ.1.2 లక్షల వరకు!

ఖాళీల వివరాలు : 

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న Punjab & Sind Bank నుంచి Specialist Officers (SO) – Credit Manager & Agriculture Manager పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.మొత్తం 190 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • క్రెడిట్ మేనేజర్ : 130
  • అగ్రికల్చర్ మేనేజర్ : 60

అర్హతలు : 

Punjab & Sind Bank SO Recruitment 2025 పోస్టులను బట్టి అభ్యర్థుల విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. 

 Credit Manager:

  • ఏదైనా డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేషన్ కనీసం 60% మార్కులు(SC/ST/OBC/PwBD – 55%). లేదా CA/CMA/CFA/MBA (Finance).
  • కనీసం 3 సంవత్సరాల బ్యాంకింగ్ అనుభవం ఉండాలి.

Agriculture Manager:

  • B.Sc. (Agriculture/Horticulture/Forestry/Animal Husbandry/Veterinary Science/Agri. Engineering) 60% మార్కులతో (SC/ST/OBC/PwBD – 55%).
  • కనీసం 3 సంవత్సరాల అనుభవం షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో ఉండాలి.

వయోపరిమితి : 

Punjab & Sind Bank SO Recruitment 2025 అభ్యర్థులకు 01.09.2025 నాటికి 23 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

Punjab & Sind Bank SO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • General/OBC/EWS : ₹850 + ట్యాక్స్
  • SC/ST/PwBD : ₹100 + ట్యాక్స్

ఎంపిక విధానం : 

Punjab & Sind Bank SO Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(English, General Awareness, Professional Knowledge)
  • ఇంటర్వ్యూ
  • రాత పరీక్షకు 70% & ఇంటర్వ్యూకు 30% weightage ఉంటుంది.

Also Read : IOB Specialist Officers Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో బంపర్ నోటిఫికేషన్

జీతం వివరాలు : 

Punjab & Sind Bank SO Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు MMGS-II Officer పే స్కేల్ ప్రకారం ₹64,820 – ₹93,960 + DA + HRA + ఇతర అలవెన్సులు జీతం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మెడికల్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, టెర్మినల్ బెనిఫిట్స్ వంటి ఇతర సౌకర్యాలు ఉంటాయి. 

దరఖాస్తు విధానం : 

Punjab & Sind Bank SO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్ punjabandsindbank.co.in ఓపెన్ చేయాలి.
  • “Recruitment” సెక్షన్‌లోకి వెళ్లి Online Application Form ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సంతకం, thumb impression, certificates) స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  • చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 19 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 10 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : SBI SCO Recruitment 2025 Out | స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లయ్ చేయండి

Leave a Comment

Follow Google News
error: Content is protected !!