APPSC Technical Assistant Recruitment 2025: ఏపీ అటవీ శాఖ నుంచి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డ్రాఫ్ట్స్‌మాన్ గ్రేడ్-II (టెక్నికల్ అసిస్టెంట్) భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

APPSC Technical Assistant Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) |
పోస్టు పేరు | డ్రాఫ్ట్స్‌మాన్ గ్రేడ్-II (టెక్నికల్ అసిస్టెంట్) |
పోస్టుల సంఖ్య | 13 |
వయోపరిమితి | 18 – 42 సంవత్సరాలు |
దరఖాస్తు ప్రక్రియ | 18 సెప్టెంబర్ – 08 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
అధికారిక వెబ్ సైట్ | psc.ap.gov.in |
Also Read : AP Prisons Department Jobs 2025 | ఏపీ జైళ్ల శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
APPSC Technical Assistant Recruitment 2025 ఏపీ అటవీ శాఖలో డ్రాఫ్ట్స్ మన్ గ్రేడ్-2(టెక్నికల్ అసిస్టెంట్) పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటిలో 12 కొత్త ఖాళీలు మరియు 1 క్యారీ ఫార్వర్డ్ పోస్టు ఉన్నాయి. వివిధ జోన్లలో(విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం, కర్నూలు) అభ్యర్థులను ఎంపకి చేయనున్నారు.
- పోస్టు పేరు : డ్రాఫ్ట్స్‌మాన్ గ్రేడ్-II (టెక్నికల్ అసిస్టెంట్)
- పోస్టుల సంఖ్య : 13
అర్హతలు :
APPSC Technical Assistant Recruitment 2025 అభ్యర్థులు ITI (Civil Draughtsman) లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. స్థానిక/నాన్-లోకల్ అభ్యర్థులు జోనల్ రూల్స్ ప్రకారం అర్హత సాధించాలి.
వయోపరిమితి :
APPSC Technical Assistant Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APPSC Technical Assistant Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: ₹250/-
- పరీక్షా ఫీజు: ₹80/-
- SC, ST, BC, Ex-Servicemen పరీక్షా ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
APPSC Technical Assistant Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.
- రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
- రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
- Paper I: General Studies & Mental Ability (150 ప్రశ్నలు – 150 మార్కులు)
- Paper II: ITI (Civil Draughtsman) సంబంధిత ప్రశ్నలు (150 ప్రశ్నలు – 150 మార్కులు)
- మొత్తం 300 మార్కులు. ప్రతీ తప్పు సమాధానానికి 1/3 మార్కు మైనస్.
Also Read : APCRDA Latest Jobs 2025 | ఏపీ రాజధాని ప్రాంతంలో భారీగా ఉద్యోగాలు
జీతం వివరాలు :
APPSC Technical Assistant Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన కమిషన్ ప్రకారం ₹34,580 నుండి ₹1,07,210/- వరకు జీతం లభిస్తుంది.
దరఖాస్తు విధానం :
APPSC Technical Assistant Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు APPSC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అభ్యర్థులు ముందుగా One Time Profile Registration (OTPR) చేయాలి.
- psc.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, ఆన్‌లైన్ అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 08 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : APDC Recruitment 2025 | ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో జాబ్ నోటిఫికేషన్
2 thoughts on “APPSC Technical Assistant Recruitment 2025 | ఏపీ అటవీ శాఖలో కొత్త నోటిఫికేషన్.. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ”