RRC SR Sports Quota Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ సెల్, దక్షణ రైల్వే నుంచి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో వివిధ పే లెవల్స్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల క్రీడాకారులు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.

RRC SR Sports Quota Recruitment 2025 Overview
నియామక సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ సెల్ |
పోస్టు పేర్లు | పే మ్యాట్రిక్స్ లెవల్-1 నుంచి లెవల్-5 వరకు పోస్టులు |
ఖాళీల సంఖ్య | 67 |
దరఖాస్తు ప్రక్రియ | 13 సెప్టెంబర్ – 12 అక్టోబర్, 2025 |
జాబ్ లొకేషన్ | దక్షిణ రైల్వే జోన్ |
Also Read : SSC Delhi Police Head Constable Notification 2025 | 552 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, దక్షిణ రైల్వేలో వివిధ పే లెవల్స్ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
పే లెవల్ | ఖాళీల సంఖ్య |
లెవల్ 4, 5 | 5 |
లెవల్ 2, 3 | 16 |
లెవల్ 1 | 46 |
మొత్తం | 67 |
అర్హతలు :
RRC SR Sports Quota Recruitment 2025 పే లెవల్ ని బట్టి పోస్టుల అర్హతలు మారుతాయి.
- లెవల్-1 : 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి + క్రీడాకారుడు
- లెవల్ 2&3 : 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత + క్రీడాకారుడు
- లెవల్ 4&5 : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ + క్రీడాకారుడు.
వయోపరిమితి :
RRC SR Sports Quota Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
RRC SR Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరి | ఫీజు | రీఫండ్ |
జనరల్ / ఓబీసీ | రూ.500/- | ట్రయల్స్ లో పాల్గొన్న తర్వాత రూ.400/- రీఫండ్ |
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మాజీ సైనికులు/దివ్యాంగులు/మైనారిటీలు/ఈబీసీ | రూ.250/- | ట్రయల్స్ లో పాల్గొన్న తర్వాత రూ.250/- రీఫండ్ |
ఎంపిక ప్రక్రియ :
RRC SR Sports Quota Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- ట్రయల్స్ : అభ్యర్థులకు క్రీడా నైపుణ్యం మరియు ఫిజికల్ ఫిట్ నెస్ అంచనా వేయడానికి ట్రయల్స్ కి పిలుస్తారు.
- క్రీడా విజయాలు మరియు విద్యార్హతలు : ట్రయల్స్ లో ఫిట్ గా ప్రకటించబడిన అభ్యర్థులు ఈ స్టేజ్ కి వెళ్తారు.
Also Read : RRB JE Recruitment 2025 | రైల్వేలో 2,570 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
RRC SR Sports Quota Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
బేసిక్ పే వివరాలు :
- లెవల్-1 : రూ.18,000/-
- లెవల్-2 : రూ.19,900/-
- లెవల్-3 : రూ.21,700/-
- లెవల్-4 : రూ.25,500/-
- లెవల్-5 : రూ.29,200/-
దీంతో పాటు DA, HRA మరియు TA వంటి అలవెన్సులు మరియు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం :
RRC SR Sports Quota Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- RRC SR Sports Quota Recruitment 2025 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 13 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 12 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : RRB NTPC Notification 2025 Out | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 8,850 పోస్టులు
1 thought on “RRC SR Sports Quota Recruitment 2025 | దక్షిణ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్”