TS WCD&SC SAA Notification 2025: తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ( SAA) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నర్సు, చౌకీదార్లు, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు :
TS WCD&SC SAA Notification 2025 తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ( SAA) నుంచి నర్సు, చౌకీదార్లు, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
నర్స్ (మహిళా) | 04 |
చౌకీదార్స్ | 03 |
సెక్యూరిటీ గార్డు | 03 (పురుషులు-1, మహిళలు-2) |
Also Read : AP HMFW Recruitment 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
అర్హతలు :
TS WCD&SC SAA Notification 2025 పోస్టును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి.
- నర్సు (మహిళలు) : అర్హత కలిగిన వైద్య సిబ్బంది ఉండాలి. సంబంధిత అర్హతలతో ANM
- చౌకీదార్లు : గతంలో నైతిక దుర్బలత్వం రికార్డు ఉన్న నిబద్దత మరియు చురుకైన అభ్యర్థులు ఉండాలి. మద్యం తాగడం, గుట్కా నమలడం వంటి అలవాట్లు ఉండకూడదు.
- సెక్యూరిటీ గార్డులు : 10వ తరగతి పాసై ఉండాలి. అభ్యర్థి యాక్టివ్ సర్వీస్ లో ట్రేడ్ మెన్ లో ఉండకూడదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో చదవడం, రాయడం మరియు మాట్లాడగల సామర్థ్యం ఉండాలి.
వయస్సు:
TS WCD&SC SAA Notification 2025 అభ్యర్థులకు 01.07.2025 నాటికి పోస్టును బట్టి 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- నర్సు : 25 – 35 సంవత్సరాలు
- చౌకీదార్స్ : 25 – 50 సంవత్సరాలు
- సెక్యూరిటీ గార్డులు : 21 – 35 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
TS WCD&SC SAA Notification 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
TS WCD&SC SAA Notification 2025 అభ్యర్థులను కేవలం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగం ఇస్తారు.
Also read : DCIL Recruitment 2025 | వైజాగ్ పోర్టులో భారీగా ఫ్లీట్ & ట్రైనీ పోస్టుల భర్తీ
జీతం వివరాలు :
TS WCD&SC SAA Notification 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- నర్సు : రూ.13,240/-
- చౌకీదార్స్ : 14,500/-
- సెక్యూరిటీ గార్డు : రూ.15,600/-
దరఖాస్తు విధానం :
TS WCD&SC SAA Notification 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అందులో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు జత చేసి కింది చిరునామాకు పంపాలి.
- అడ్రస్ : డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ WCD&SC, హైదరాబాద్, స్నేహా సిల్వర్ జూబ్లి కాంప్లెక్స్, 4వ అంతస్తు, రూమ్ నెం.404, హైదరాబాద్ కలెక్టరేట్ ప్రెమిసెస్, లక్డీకాపూల్, హైదరాబాద్-500004
దరఖాస్తులకు చివరి తేదీ : 15 సెప్టెంబర్, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |
Also Read : TSLPRB APP Recruitment 2025 | తెలంగాణ పోలీస్ శాఖలో బంపర్ ఉద్యోగాలు
1 thought on “TS WCD&SC SAA Notification 2025 | జిల్లా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు”