IB JIO Tech Recruitment 2025 భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2(JIO-II / Tech) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 394 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
IB JIO Tech Recruitment 2025 Overview
| నియామక సంస్థ | ఇంటెలిజెన్స్ బ్యూరో(IB), హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
| పోస్టు పేరు | జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 / టెక్ |
| ఖాళీల సంఖ్య | 394 |
| దరఖాస్తు ప్రక్రియ | 23 ఆగస్టు – సెప్టెంబర్ 14, 2025 |
| జీతం | రూ.25,500 – రూ.81,100/- |
| ఎంపిక ప్రక్రియ | టైర్-1 రాత పరీక్ష, టైర్-2 స్కిల్ టెస్ట్, టైర్-3 ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్, డక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ |
ఖాళీల వివరాలు
భారత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ద్వారా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ఫీల్డ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం
- మొత్తం పోస్టుల సంఖ్య : 394
అర్హతలు :
IB JIO Tech Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- ఎలక్ట్రానిక్స్ / ఈసీఈ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఐటీ / సీఎస్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉండాలి. లేదా
- ఎలక్ట్రానిక్స్ / సీఎస్ / ఫిజిక్స్ / మ్యాథమెటిక్స్ తో సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. లేదా
- కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ (బీసీఏ)
వయోపరిమితి :
IB JIO Tech Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IB JIO Tech Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ (పురుషులు) : రూ.650/-
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు : రూ.550/-
ఎంపిక ప్రక్రియ :
IB JIO Tech Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- టైర్-1 రాత పరీక్ష (100 మార్కులు)
- టైర్-2 స్కిల్ / ప్రాక్టికల్ టెస్ట్ (30 మార్కులు)
- టైర్-3 ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్(20 మార్కులు)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
IB JIO Tech Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పేమ్యాట్రిక్స్ లెవల్-4 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.
- రూ.25,500 – రూ.81,100/- వరకు జీతం
దరఖాస్తు ప్రక్రియ :
IB JIO Tech Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- IB JIO Tech Recruitment 2025 పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి, దరఖాస్తు ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 23 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 14 సెప్టెంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |