TG APP Recruitment 2025 తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అప్లికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది.
పోస్టుల వివరాలు :
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 95 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 23 పోస్టులు బ్యాక్ లాగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
మల్టీ జోన్ వారీగా ఖాళీల వివరాలు
మల్టీ జోన్ | ఖాళీలు |
మల్టీ జోన్ – 1 | 50 |
మల్టీ జోన్-2 | 68 |
మొత్తం | 118 |
అర్హతలు :
TG APP Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి
- లా డిగ్రీ కలిగి ఉండాలి. బార్ కౌన్సిల్ లో ఎన్ రోట్మెంట్ తప్పనిసరి. రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి.
వయోపరిమితి :
TG APP Recruitment 2025 అభ్యర్థులకు 01.07.2025 నాటికి 34 సంవత్సాలు మించకుండా వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
TG APP Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది.
- పేపర్-1 : ఆబ్జెక్టివ్ టైప్ లో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
- పేపర్-2 : డిస్క్రిప్టివ్ టైప్ లో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పేపర్-1 లో అర్హత సాధించిన వారికే పేపర్-2 మూల్యాంకనం జరుగుతుంది.
జీతం వివరాలు :
TG APP Recruitment 2025 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
TG APP Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
Notification | Click here |
Official Website | Click here |