APPSC Executive Officer Grade-III Notification 2025 | ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APPSC Executive Officer Grade-III Notification 2025 ఆలయాల్లో సేవ చేయాలనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 ఆగస్టు 12న నోటిఫికేషన్ నం.10/2025 విడుదల చేసింది. ఇందులో ఏపీ ఎండోవ్మెంట్స్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఇది కేవలం ఉద్యోగావకాశమే కాకుండా, ఆలయ పరిపాలనలో ఒక గౌరవప్రదమైన సేవ చేయగల అవకాశాన్ని అందిస్తోంది.

APPSC Executive Officer Grade-III Notification 2025 Overview

నియామక సంస్థఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC)
పోస్టు పేరుఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య07
దరఖాస్తు ప్రక్రియ13 ఆగస్టు – 02 సెప్టెంబర్, 2025
వయస్సు18 – 42 సంవత్సరాలు
అర్హతలుఏదైనా డిగ్రీ
ఎంపిక ప్రక్రియరాత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
జాబ్ లొకేషన్ఆంధ్రప్రదేశ్

పోస్టుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీస్ లో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 07 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  • మొత్తం పోస్టుల సంఖ్య : 07

అర్హతలు : 

APPSC Executive Officer Grade-III Notification 2025 అభ్యర్థి తప్పనిసరిగా హిందూ మతాన్ని ఆచరించే వ్యక్తి కావాలి. అదేవిధంగా, గుర్తింపు పొందిన భారత విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్ & ఎండోవ్మెంట్స్ యాక్ట్, 1987 సెక్షన్ 29(3) ప్రకారం తప్పనిసరి అర్హత.

  • ఏదైన డిగ్రీ ఉత్తీర్ణత

వయోపరిమితి : 

APPSC Executive Officer Grade-III Notification 2025  అభ్యర్థులకు 01.07.2025 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 

APPSC Executive Officer Grade-III Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.250/- మరియు ఎగ్జామినేషన్ ఫీజు రూ.80/- చెల్లించాలి. 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులకు రూ.80/- ఫీజు మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

APPSC Executive Officer Grade-III Notification 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్

జీతం వివరాలు : 

APPSC Executive Officer Grade-III Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.80,910/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో నెలకు రూ.40,000/- వరకు జీతం లభిస్తుంది. 

దరఖాస్తు విధానం : 

APPSC Executive Officer Grade-III Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా APPSC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 13 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 02 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!