ITPO Deputy Manager Recruitment 2025 ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు UPSC సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ లేదా CAPF (ACs) ఎగ్జామ్స్ 2023 ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
ITPO Deputy Manager Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ నుంచి డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిప్యూటీ మేనేజర్ (జనరల్, లా, ఫైనాన్స్, ఆర్కిటెక్చర్, సివిల్, సెక్యూరిటీ, ఫైర్) విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డిప్యూటీ మేనేజర్ విభాగం | ఖాళీలు |
జనరల్ కేడర్ | 18 |
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ | 06 |
సివిల్ | 03 |
లా | 01 |
ఆర్కిటెక్చర్ | 01 |
సెక్యూరిటీ | 01 |
ఫైర్ | 01 |
మొత్తం | 31 |
అర్హతలు మరియు అనుభవం :
ITPO Deputy Manager Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మరియు అనుభవం మారుతుంది.
డిప్యూటీ మేనేజర్ విభాగం | అర్హతలు | అనుభవం |
జనరల్ కేడర్ | బ్యాచిలర్ డిగ్రీ లేదా CA / CMA / కంపెనీ సెక్రటరీ | తప్పనిసరి కాదు |
లా | LLB / BGL | 3 సంవత్సరాల అనుభవం |
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ | MBA (ఫైనాన్స్) లేదా ICAI లేదా ICMAI లో అసోసియేట సభ్యత్వం | 2 సంవత్సరాల అనుభవం |
ఆర్కిటెక్చర్ | ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ | తప్పనిసరికాదు |
సివిల్ | సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ | తప్పనిసరికాదు |
సెక్యూరిటీ | ఆర్ట్స్ / సైన్స్ / కామ్స్ లో బ్యాచిలర్ డిగ్రీ | 4 సంవత్సరాల అనుభవం |
ఫైర్ | డిగ్రీ మరియు నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ, నాగ్్ పూర్ నుంచి అడ్వాన్స్డ్ డిప్లొమా లేదా బీఈ(ఫైర్) | 3 సంవత్సరాల అనుభవం |
వయస్సు:
ITPO Deputy Manager Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.
- ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ : 32 సంవత్సరాలు
- ఫైర్ : 35 సంవత్సరాలు
- ఇతర విభాగాలకు : 30 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు
అప్లికేషన్ ఫీజు :
ITPO Deputy Manager Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.1,000/-
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్ మెన్ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
ITPO Deputy Manager Recruitment 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- UPSC పరీక్షల స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లేదా ఇంజనీరింగ్ సర్వీసెస్ లేదా CAPF(ACs) పరీక్ష 2023 ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లిన అభ్యర్థుల స్కోర్ల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేయబడతారు.
- ఇంటర్వ్యూ : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు పిలుస్తారు.
జీతం :
ITPO Deputy Manager Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 – 1,40,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అంటే అభ్యర్థులకు అన్ని కలుపుకుని నెలకు రూ.70,000 నుంచి రూ.85,000/- వరకు జీతం అందుతుంది.
దరఖాస్తు విధానం :
ITPO Deputy Manager Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- ITPO Deputy Manager Recruitment 2025 పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- లాగిన్ అయి ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 31 జూలై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 29 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |