NHPC Apprentice Recruitment 2025 నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 361 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 11వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
NHPC Apprentice Recruitment 2025 Overview:
నియామక సంస్థ | నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC) |
పోస్టు పేరు | గ్రాడ్యుయేట్ / ఐటీఐ / డిప్లొమా అప్రెంటిస్ |
పోస్టుల సంఖ్య | 361 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 11 ఆగస్టు, 2025 |
జాబ్ లొకేషన్ | ఇండియాలోని NHPC లొకేషన్స్ |
పోస్టుల వివరాలు :
నేషనల్ హైడ్రోఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వివిధ గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 361 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 361
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 148 |
డిప్లొమా అప్రెంటిస్ | 82 |
ఐటీఐ అప్రెంటిస్ | 131 |
అర్హతలు :
NHPC Apprentice Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | అర్హతలు |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | BE / B.Tech / BSc (Engineering) / MBA / B.Com / LLB / MA(Hindi/English) / BPT / BSc (Nursing) |
డిప్లొమా అప్రెంటిస్ | సంబంధిత విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా |
ఐటీఐ అప్రెంటిస్ | సంబంధిత విభాగాల్లో ఐటీఐ |
వయస్సు :
NHPC Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NHPC Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
NHPC Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మెరిట్ లిస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
NHPC Apprentice Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ షిప్ సమయంలో స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : రూ.15,000/-
- డిప్లొమా అప్రెంటిస్ : రూ.13,500/-
- ఐటీఐ అప్రెంటిస్ : రూ.12,000/-
దరఖాస్తు విధానం :
NHPC Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- గ్రాడ్యుయేట్ / డిప్లొమా అభ్యర్థులు NATS లో, ఐటీఐ అభ్యర్థులు NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- కెరీర్ విభాగంలో ‘ఎంగేజ్మెంట్ ఆఫ అప్రెంటిస్’ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 11.07.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 11.08.2025
Notification | Click here |
Graduate / Diploma Apprentice Apply Online | Click here |
ITI Apprentice Apply Online | Click here |