Indian navy Civilian Notification 2025 ఇండియన్ నేవీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ఇండియన్ నేవీలో భారీ నోటిఫికేషన్ అయితే వెలువడింది. వివిధ విభాగాల్లో గ్రూప్ ‘బి’ (నాన్ గెజిటెడ్) మరియు గ్రూప్ ‘సి’ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో ఛార్జ్ మ్యాన్, సాఫ్ట్ నర్స్, ట్రేడ్స్ మ్యాన్ మేట్, స్టోర్ కీపర్, డ్రైవర్ మరియు మరెన్నో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూలై 5వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
Indian navy Civilian Notification 2025 Overview :
నియామక సంస్థ | ఇండియన్ నేవీ |
పోస్టు పేరు | గ్రూప్ ‘బి’ (నాన్-గెజిటెడ్) మరియు గ్రూప్ ‘సి’ సివిలియన్ |
పోస్టుల సంఖ్య | 1100 |
జాబ్ లొకేషన్ | పాన్ ఇండియా |
దరఖాస్తులకు చివరి తేదీ | 18 జూలై, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
పోస్టుల వివరాలు :
ఇండియన్ నేవీలో వివిధ విభాగాల్లో గ్రూప్ ‘బి’ (నాన గెజిటెడ్) మరియు గ్రూప్ ‘సి’ సివిలియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 1100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీల వివరాలు :
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ఛార్జ్ మ్యాన్(గ్రూప్ బి) | 227 |
ట్రేడ్స్ మన్ మేట్ | 207 |
స్టోర్ కీపర్ | 176 |
సివిలియన్ మోటార్ డ్రైవర్ | 117 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 194 |
ఫైర్ మెన్ | 90 |
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ | 14 |
స్టాఫ్ నర్స్ | 01 |
ఫార్మసిస్ట్ | 06 |
అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటౌచర్ | 02 |
డ్రాఫ్ట్స్ మన్(కన్ట్స్రక్షన్) | 02 |
కెమెరామెన్ | 01 |
పెస్ట్ కంట్రల్ వర్కర్ | 53 |
భండారి | 01 |
లేడీ హీత విజిటర్ | 01 |
స్టోర్ సూపరింటెండెంట్(ఆర్మమెంట్) | 08 |
అర్హతలు :
Indian navy Civilian Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతాయి.
పోస్టు పేరు | అర్హతలు |
ట్రేడ్స్ మెన్ మేట్ | 10వ తరగతి + ఐటీఐ |
ఛార్జ్ మ్యాన్ | సంబంధిత ట్రేడ్ లో BSc / డిప్లొమా |
డ్రాఫ్ట్స్ మ్యాన (కన్ట్స్రక్షన్) | ఐటీఐ |
ఫైర్ మ్యాన్ | 10+2 బేసిక్ ఫైర్ ఫైటింగ్ కోర్సు |
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ | ఇంటర్ + హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ |
పెస్ట్ కంట్రోల్ స్టాఫ్ | 10వ తరగతి |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 10వ తరగతి |
స్టాఫ్ నర్స్ | 10వ తరగతి + నర్స్ ట్రైనింగ్ సర్టిఫికెట్ + మెడికల్ మరియు సర్జికల్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీలో పూర్తి ట్రైనింగ్ పొందిన నర్సుగా నమోదు చేసుకోవాలి. |
భండారీ | 10వ తరగతి + ఈత + 1 సంవత్సరం అనుభవం |
లేడీ హెల్త్ విజిటర్ | ఏఎన్ఎమ్ + కొంత ప్రత్యేక శిక్షణ |
సివిలియన్ మోటార్ డ్రైవర్ | 10వ తరగతి + హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ + 1 సంవత్సరం అనుభవం |
స్టోర్ కీపర్ | ఇంటర్ + 1 సంవత్సరం అనుభవం |
ఫార్మసిస్ట్ | ఫార్మసీలో డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం |
కెమెరామెన్ | ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా + 5 సంవత్సరాల అనుభవం |
అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటౌచర్ | కమర్షియల్ ఆర్ట్స్ / పెయింటింగ్ టెక్నాలజీ / లితోగ్రఫీలో డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం |
వయోపరిమితి :
Indian navy Civilian Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- స్టాఫ్ నర్స్, లేడీ హెల్త్ విజిటర్ : 18 నుంచి 45 సంవత్సరాలు
- ఛార్జ్ మెన్, కెమెరామెన్ : 18 నుంచి 30 సంవత్సరాలు
- ఫార్మసిస్ట్ మరియు ఫైర్ ఇంజిన్ డ్రైవర్ : 18 నుంచి 27 సంవత్సరాలు
- ఇతర పోస్టులకు : 18 నుంచి 25 సంవత్సరాలు
- వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Indian navy Civilian Notification 2025 జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులు రూ.295/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
Indian navy Civilian Notification 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- శారీరక పరీక్ష (ఫైర్ మెన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
జీతం వివరాలు :
Indian navy Civilian Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది.
గ్రూప్ ‘బి’ పోస్టులు (ఉదాహరణకు స్టాఫ్ నర్స్, ఛార్జ్ మెన్)
- స్టాఫ్ నర్స్ : రూ.44,900 – రూ.1,42,400/-
- ఛార్జ్ మెన్ : రూ.35,400 – రూ.1,12,400/-
గ్రూప్ ‘సి’ పోస్టులు (ఉదాహరణకు ట్రేడ్స్ మెన్, ఫైర్ మెన్, ఎంటీఎస్)
- ఫార్మసిస్ట్ : రూ.29,200 – రూ.92,300/-
- స్టోర్ సూపరింటెండెంట్ : రూ.25,500 – రూ.81,100/-
- ఫైర్ ఇంజిన్ డ్రైవర్ : రూ.21,700 – రూ.69,100/-
- స్టోర్ కీపర్/ ఫైర్ మెన్ : రూ.19,900 – రూ.63,200/-
- ట్రేడ్స్ మెన మేట్ / ఎంటీఎస్ : రూ.18,000 – రూ.56,900/-
దరఖాస్తు విధానం :
Indian navy Civilian Notification 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- హోమ్ పేజీతో ‘Join Navy’ – ‘Way to Join’ – ‘Civilian’ – ‘INCET-01/2025’ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ చేసుకోవాాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
- అమసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 05 జూలై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 18 జూలై, 2025
Notification | Click here |
Apply Online | Click here |