CCI Recruitment 2025 | సిమెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CCI Recruitment 2025 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజనీర్, ఆఫీసర్ మరియు అనలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ మోడ్ ద్వారా జూలై 12వ తేదీ లోపు సమర్పించాలి. 

CCI Recruitment 2025 Overview : 

నియామక సంస్థ పేరుసిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI)
పోస్టు పేరుఇంజనీర్, ఆఫీసర్ మరియు అనలిస్ట్
పోస్టుల సంఖ్య29
జాబ్ లొకేషన్భారతదేశంలోని CCI యూనిట్ లేదా కార్యాలయంలో పోస్టింగ్ 
ఉద్యోగ రకంకాంట్రాక్ట్ 

పోస్టుల వివరాలు : 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ సాంకేతిక మరియు పరిపాలనా విభాగాల్లో మొత్తం 29 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

పోస్టు పేరువిభాగంఖాళీల సంఖ్య
ఇంజనీర్ప్రొడక్షన్07
ఇంజనీర్మెకానికల్02
ఇంజనీర్సివిల్01
ఇంజనీర్మైనింగ్04
ఇంజనీర్ఇన్ స్ట్రుమెంటేషన్04
ఇంజనీర్ఎలక్ట్రికల్02
ఆఫీసర్మెటీరియల్ మేనేజ్మెంట్02
ఆఫీసర్మార్కెటింగ్01
ఆఫీసర్హ్యూమన్ రీసోర్స్02
ఆఫీసర్కంపెనీ సెక్రటరీ01
ఆఫీసర్రాజ్ భాష అధికారి01
అనలిస్ట్ఫైనాన్స్ మరియు అకౌంట్స్02

అర్హతలు మరియు అనుభవం : 

CCI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

పోస్టు పేరుఅర్హతలు మరియు అనుభవం
ఇంజనీర్(ప్రొడక్షన్)కెమికల్ / సిమెంట్ టెక్నాలజీ / సిరామిక్ లేదా సంబంధిత రంగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ (లేదా) కెమిస్ట్రీ / మెటీరియల్స్ సైన్స్ లో ఎంఎస్సీ + 2 సంవత్సరాల అనుభవం
ఇంజనీర్ (మెకానికల్)మెకానికల్ / ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ / మెకాట్రానిక్స్ లేదా సంబంధిత రంగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం
ఇంజనీర్ (సివిల్)సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం
ఇంజనీర్ (మైనింగ్)మైనింగ్ / ఓపెన్ కాస్ట్ మైనింగ్్ లేదా సంబంధిత రంగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ + ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ మేనేజర్స్ సర్టిఫికెట్ ఆఫ్ కంపిటెన్సీతో పాటు ఓపెన్ కాస్ట్ మెకనైజ్డ్ గనులలో క్వారీ నిర్వహణలో 2 సంవత్సరాల అనుభవం
ఇంజనీర్ (ఇన్ స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్)ఎలక్ట్రికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత విభాగాలల్లో ఇంజనీరింగ్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం
ఆఫీసర్(మెటీరియల్ మేనేజ్మెంట్)ఇంజనీరింగ్ డిగ్రీ లేదా మెటీరియల్స్ మేనేజ్మెంట / సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం
ఆఫీసర్ (మార్కెటింగ్)మార్కెటింగ్ లో ఎంబీఏ / బీబీఏ + 1-2 సంవత్సరాల అనుభవం
అనలిస్ట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)CA / ICWA లేదా ఫైనాన్స్ లో ఎంబీఏ + 2 సంవత్సరాల అనుభవం
ఆఫీసర్ (హ్యూమన్ రీసోర్స్)MBA + 2 సంవత్సరాల అనుభవం
ఆఫీసర్ (కంపెనీ సెక్రటరీ)ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీస్ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం కలిగి ఉండాలి + 2 సంవత్సరాల అనుభవం
ఆఫీసర్ (రాజ్ భాషా అధికారి)హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ + హిందీ నుంచి ఇంగ్లీష్ లో ట్రాన్స్ లేషన్ లో అనుభవం

వయస్సు : 

CCI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అనలిస్ట్ పోస్టుకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

CCI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే UR / OBC / EWS అభ్యర్థులు రూ.100/- ఫీజు చెల్లించాలి. SC / ST / PwD / మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజు ఆఫ్ లైన్ లో చెల్లించాలి. ‘సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ పేరుతో డీడీ తీయాలి. 

ఎంపిక ప్రక్రియ : 

CCI Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • షార్ట్ లిస్ట్ : అభ్యర్థుల అర్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • ఇంటర్వ్యూ : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
  • రాత పరీక్ష / గ్రూప్ డిస్కషన్(అవసరమైతే) : ఒకే పోస్టుకు ఎక్కువ దరఖాస్తులు వస్తే.. ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి రాత పరీక్ష లేదా గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

జీతం వివరాలు : 

CCI Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000/- కన్సాలిడేటెడ్ జీతం ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేట్ / ప్రాంతీయ / జోనల్ కార్యాలయాల్లో పోస్టింగ్ వచ్చిన అభ్యర్థులకు రూ.10,000/- HRA అదనంగా ఇవ్వడం జరుగుతుంది. యూనిట్లలో పోస్టింగ్ వస్తే లభ్యతను బట్టి వసతి కల్పించబడుతుంది. 

దరఖాస్తు విధానం : 

CCI Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • దరఖాస్తు ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి. అప్లికేషన్ కి ఇటీవలి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించిన డీడీ సిద్ధం చేసుకోవాలి. 
  • అవసరమైన అన్ని పత్రాల స్వీయ ధ్రువీకరించబడిన జిరాక్స్ కాపీలను జత చేయాలి. 
  • పూర్తి చేసిన దరఖాస్తు, డీడీ మరియు అన్ని డాక్యుమెంట్స్ ఒక కవరులో ఉంచి కింద ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపాలి. 
  • పోస్టల్ అడ్రస్ : AGM(HR), సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్ట్ బాక్స్ నెం.3061, లోధి రోడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ-110003.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 12 జూలై, 2025 (సాయంత్రం 5.00 గంటల లోపు)
NotificationClick here
Application Click here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!