UIDAI Internship 2025 యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2025 సంవత్సరానికి ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ ని ప్రకటించింది. టెక్నికల్, లీగల్, మేనేజ్మెంట్, ఫైనాన్స్ మరియు సంధిత రంగాల్లో ఇంటర్న్ షిప్ అందిస్తున్నారు. యూజీ / పీజీ / పీహెచ్డీ చదువుతున్న లేదా ఇటీవల పూర్తి చేసిన విద్యార్థులు UIDAI Internship 2025 ప్రోగ్రామ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.
UIDAI Internship 2025
ఇంటర్న్ షిప్ వివరాలు :
UIDAI Internship 2025 యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతీయ కార్యాలయాలు మరియు సాంకేతిక కేంద్రాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ విద్యార్థులకు సాంకేతికత, చట్టపరమైన డొమైన్ లు, మీడియా, నిర్వహణ మరియు వివిధ రంగాల్లో ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ మరియు ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే అవకాశాన్ని అందిస్తుంది. ఇంటర్న్ షిప్ కి ఎంపికైన వారు ఎక్స్ పీరియన్స్ మెంటర్స్ గైడెన్స్ లో పనిచేస్తారు. UIDAI యొక్క నూతన టెక్నాలజీ మరియు కార్యకలాపాలపై అవగాహన పొందుతారు. దీని ద్వారా కెరీర్ అవకాశాలను మెరుగుపడుతుంది.
Number of Interns :
- ప్రతి హెడ్ ఆఫీస్ డివిజన్ : 04
- ప్రతి రీజనల్ ఆఫీస్ : 05
- టెక్నాలజీ సెంటర్ : 30
- ప్రతి స్టేట్ ఆఫీస్ : 02
అర్హతలు :
UIDAI Internship 2025 ప్రోగ్రామ్ కి దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థల నుంచి చివరి సంత్సరం లేదా ప్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు లేదా తాజా గ్రాడ్యుయేట్లు / పోస్ట్ గ్రాడ్యుయేట్లు (పాస్ అయిన 6 నెలల్లోపు) దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60% మార్కులు అవసరం.
ఫీల్డ్స్ :
- టెక్నికల్ ఫీల్డ్ : BE, B.Tech, M.tech, MCA మరియు ఇతర సంబంధిత కోర్సులు
- ఇతర ఫీల్డ్స్ : లా, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్
- PhD రీసెర్చ్ విద్యార్థులు: కంప్యూటర్ సైన్స్, సైబర్ లాస్, డేటా ప్రైవసీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ తదితర రంగాల్లో రిజిస్టర్డ్ పీహెచ్డీ విద్యార్థులకు సూపర్ వైజర్ నుంచి రెకమెండేషన్ లెటర్ అవసరం ఉంటుంది.
ఇంటర్న్ షిప్ పీరియడ్ :
UIDAI Internship 2025 ఎంపికైన వారికి కనీసం 6 వారాల నుంచి 12 నెలల వరకు ఇంటర్న్ షిప్ ఉంటుంది. నిర్దేశిత కాలంలో పూర్తి చేయని విద్యార్థులక సర్టిఫికెట్ జారీ చేయరు.
అప్లికేషన్ ఫీజు :
UIDAI Internship 2025 ఇంటర్న్ షిప్ కి దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
UIDAI Internship 2025 ఇంటర్న్ షిప్ కి దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా అప్లికేషన్ స్క్రీనింగ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను వ్యక్తిగత లేదా వర్చువల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- అప్లికేషన్ స్క్రీనింగ్
- వ్యక్తిగత/ వర్చువల ఇంటర్వ్యూ
స్టైఫండ్ :
UIDAI Internship 2025 ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కి ఎంపికైన వారికి నెలకు రూ.20,000 – రూ.50,000/- వరకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
కేటగిరీ | టెక్నికల్ ఫీల్డ్ | ఇతర ఫీల్డ్ |
గ్రాడ్యుయేట్ | రూ.30,000/- | రూ.20,000/- |
పోస్ట్ గ్రాడ్యుయేట్ | రూ.40,000/- | రూ.30,000/- |
MBA / PGDM | NA | రూ.40,000/- |
PhD / రీసెర్చ్ | రూ.50,000/- | రూ.40,000/- |
దరఖాస్తు విధానం :
UIDAI Internship 2025 ఇంటర్న్ షిప కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు UIDAI వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని డౌన్ లోడ్ చేసుకుని ఫిల్ చేయాలి.
- CV మరియు సంబంధిత డాక్యుమెంట్లు, NOC(వర్తిస్తే) జత చేసి ఈమెయిల్ ద్వారా పంపాలి.
- గత 6 నెలల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి NOC అవసరం లేదు.
ఇంటర్న్ షిప్ స్థానాలు :
- హెడ్ ఆపీస్ : న్యూఢిల్లీ
- టెక్నాలజీ సెంటర్ : బెంగళూరు
- రీజనల్ ఆఫీసులు : బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్, లక్నో, రాంచీ, ముంబై
- స్టేట్ ఆఫీస్ : పాట్నా, కోల్ కతా, భోపాల్, భువనేశ్వర్, అహ్మదాబాద్, తిరువనంతపురం
Notification & Application | Click here |