IRCON Executive Recruitment 2025 | IRCON లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్

IRCON Executive Recruitment 2025 రైల్వే మంత్రిత్వ శాఖ పరిధఇలోని మౌలిక సదుపాయల ప్రభుత్వ సంస్థ అయిన IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జూన్ 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు. 

 IRCON Executive Recruitment 2025

పోస్టుల వివరాలు : 

కేంద్ర ప్రభుత్వ సంస్థ  అయిన IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది రైల్వేలు, రహదారులు, భవనాలు మరియు విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పిస్తుంది. ఈ సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ  చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని లేదా విదేశాల్లో ఉన్న కంపెనీ ప్రాజెక్టులు లేదా కార్యాలయాల్లో అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. 

  • సంస్థ పేరు : IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్
  • పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్
  • పోస్టుల సంఖ్య : 15

అర్హతలు :

IRCON Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్  లో పూర్తి సమయం గ్రాడ్యుయేట్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు హైవే ప్రాజెక్టులు / రైల్వే ట్రాక్ ప్రాజెక్టుల అమలులో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.  

వయస్సు: 

IRCON Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 

IRCON Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ అభ్యర్థులు రూ.1,000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBCరూ.1,000/-
SC / ST / EWS / ExSmఫీజు లేదు

డిమాండ్ డ్రాఫ్ట్ : అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ను ‘ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, న్యూఢిల్లీ’ పేరుతో తీయాలి. 

ఎంపిక ప్రక్రియ: 

IRCON Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ముందుగా అర్హత ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులను రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూకు పిలుస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 

జీతం వివరాలు : 

IRCON Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000 – రూ.1,20,000/- పే స్కేల్ తో జీతం ఇస్తారు. 

దరఖాస్తు విధానం :

IRCON Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి. అవసరమైన పత్రాలను జత చేయాలి. అప్లికేషన్ ఫారమ్ ని కింది అడ్రస్ కి జూన్ 13వ తేదీ లోపు పోస్ట్ ద్వారా పంపాలి. 

అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ : జాయింట్ జనరల్ మేనేజర్ / HRM, IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్, C-4, డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, న్యూఢిల్లీ – 110017

  • దరఖాస్తులకు చివరి తేదీ : 13 – 06 – 2025
Notification & ApplicationClick here

1 thought on “IRCON Executive Recruitment 2025 | IRCON లో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!