ZSI Recruitment 2025 జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 06 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తులు మే 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ZSI Recruitment 2025
పోస్టుల వివరాలు :
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 06 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్, వెస్ట్ కమెంగ్, వెస్ట్ సిక్కిం, ఈస్ట్ సిక్కిం, నార్త్ సిక్కిం, సౌత్ సిక్కిం మరియు కోల్ కతాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ లో లేదా ప్రాజెక్ట్ అవసరాలను బట్టి ఇతర ప్రాంతాల్లో కూడా పని చేయాల్సి ఉంటుంది.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సీనియర్ రీసెర్చ్ ఫెలో | 01 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | 05 |
అర్హతలు:
ZSI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
సీనియర్ రీసెర్చ్ ఫెలో | జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ, బయో-ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లేదా లైఫ్ సైన్స్ లో MSc మరియు కనీసం 2 సంవత్సరాల రీసెర్చ్ అనుభవం ఉండాలి. PhD థీసిస్ సబ్మిట్ చేసిన అభ్యర్థులు కూడా అర్హలు. |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | జువాలజీ, బోటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయో-ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా లైఫ్ సైన్స్ లో కనీసం 60 శాతం మార్కులతో MSc |
వయస్సు:
ZSI Recruitment 2025 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 32 సంవత్సరాలు, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
ZSI Recruitment 2025 జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
ZSI Recruitment 2025 సీనియర్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- సీనియర్ రీసెర్చ్ ఫెలో : రూ.42,000/- + HRA
- జూనియర్ రీసెర్చ్ ఫెలో : రూ.37,000/- + HRA
దరఖాస్తు విధానం :
ZSI Recruitment 2025 జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ ని ఈమెయిల్ ద్వారా లేదా పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫారమ్ మరియు స్వీయ ధ్రువీకరణ పత్రాలు (రెజ్యూమ్, విద్యార్హతలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్, ఎన్ఓసీ, రీసెర్చ్ పేపర్స్) స్కాన్ చేసి ఈమెయిల్ చేయాలి.
- ఈమెయిల్ ఐడీ : jasbose@gmail.com
- ఈమెయిల్ సబ్జెక్ట్ : ‘Application for the post of SRF / JRF NMHS Funded Project Assessing the potential Health of India Himalayan Peatland’
- హార్డ్ కాపీ : అప్లికేషన్ ఫారమ్ మరియు స్వీయ ధ్రువీకరణ పత్రాలను స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా కింది అడ్రస్ కి పంపాలి.
- చిరునామా : ది డైరెక్టర్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, M- Block, న్యూ అలిపోర్, కోల్ కతా – 700053, పశ్చిమ బెంగాల్.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 14 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 10 – 06 – 2025
Notification & Application | CLICKHERE |
Official Website | CLICK HERE |