Indian Army 10+2 TES-54 Recruitment 2025 ఆర్మీ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. Indian Army 10+2 TES నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఆర్మీలో సేవ చేయాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం.. Indian Army 10+2 TES-54 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు మే 13వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు Indian Army 10+2 TES-54 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయస్సు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
Indian Army 10+2 TES-54 Recruitment 2025
పోస్టుల వివరాలు :
Indian Army 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు ఇండియన్ ఆర్మీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇండియన్ ఆర్మీ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గించవచ్చు. కోర్సులో ఎంపికైన అభ్యర్థులకు 4 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్ పోస్టును ఇస్తారు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 90
విద్యార్హతలు :
Indian Army 10+2 TES-54 Recruitment 2025 అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లలో కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటు JEE (మెయిన్స్ 2025) పరీక్షకు హాజరై ఉండాలి.
- 10+2 ఉత్తీర్ణత (ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ లో కనీసం 60%)
- అవివాహిత పురుషులు మాత్రమే
వయోపరిమితి:
Indian Army 10+2 TES-54 Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జూలై 01, 2025 నాటికి 16.5 నుండి 19.5 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు 02/01/2006 కంటే ముందు మరియు 01/01/2009 కంటే తరువాత జన్మించి ఉండకూడదు.
దరఖాస్తు ఫీజు:
Indian Army 10+2 TES-54 Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరిల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
Indian Army 10+2 TES-54 Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఆధారంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- షార్ట్ లిస్ట్ అప్లికేషన్
- సర్వీస్ సెలక్షన్ బోర్డు(SSB) ఇంటర్వ్యూ
- మెడికల్ టెస్ట్
- మెరిట్ అండ్ జాయినింగ్ లెటర్
ఫిజికల్ స్టాండర్డ్స్: జాయినింగ్ లెటర్లు జారీ చేయబడిన అభ్యర్థులు కింద ఇవ్వబడిన కనీస ఫిజికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి.
- 2.4 కి.మీ. రన్నీంగ్ – 10 నిమిషాల 30 సెకండ్స్
- పుష్ అప్స్ – 40
- పుల్ అప్స్ – 06
- సిట్ అప్ – 30
- స్క్వాట్స్ – 2 సెట్స్ 30 రిపిటేషన్స్
- లంగ్స్ – 2 సెట్స్ 10 రిపిటేషన్స్
- స్విమ్మింగ్ : స్విమ్మింగ్ లో ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి.
పే స్కేల్ :
Indian Army 10+2 TES-54 Recruitment 2025 కోర్సుకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ నిబంధనల ప్రకారం పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. పే స్కేల్ వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొనబడింది.
దరఖాస్తు విధానం:
Indian Army 10+2 TES-54 Recruitment 2025 కోర్సుకు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 13 – 05 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 12 – 06 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |