SJVN Executive Trainee Recruitment 2025 ప్రముఖ పవర్ జనరేషన్ కంపెనీ అయిన సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ (SJVN) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హ్యూమన్ రీసోర్స్ , ఫైనాన్స్, లా మరియు ఇతర విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
SJVN Executive Trainee Recruitment 2025
పోస్టుల వివరాలు :
సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హ్యూమన్ రీసోర్స్, ఫైనాన్స్, లా మరియు ఇతర విభాగాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య : 114
పోస్టుల విభాగాలు | ఖాళీలు |
సివిల్ ఇంజనీరింగ్ | 30 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 15 |
మెకానికల్ ఇంజనీరింగ్ | 15 |
హ్యూమన్ రీసోర్స్ | 07 |
ఎన్విరాన్మెంట్ | 07 |
జియాలజీ | 07 |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 06 |
ఫైనాన్స్ | 20 |
లా | 07 |
అర్హతలు :
SJVN Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు కింద అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సివిల్ ఇంజనీరింగ్ : సివిల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ : ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో BE / B.Tech
- మెకానికల్ ఇంజనీరింగ్ : మెకానికల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech
- హ్యూమన్ రీసోర్స్ : పర్సనల్ / HR స్పెషలైజేషన్ తో MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
- ఎన్విరాన్మెంట్ : ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో పీజీ
- జియాలజీ : MSC / M.Tech (జియాలజీ / జియోఫిజిక్స్ / అప్లైడ్ జియాలజీ)
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : BE / B.Tech (IT / CS / Computer Engineering)
- ఫైనాన్స్ : CA / ICWA-CMA లేదా ఫైనాన్స్ స్పెషలైజేషన్ తో MBA
- లా : 3 సంవత్సరాల LLB లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ
వయస్సు :
SJVN Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
SJVN Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.708/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ లకు ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
SJVN Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (75% వెయిటేజీ)
- గ్రూప్ డిస్కషన్ (10% వెయిటేజీ)
- పర్సనల్ ఇంటర్వ్యూ (15% వెయిటేజీ)
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 150 ప్రశ్నలు అడుగుతారు. 2 గంటల సమయం ఇస్తారు. వీటిలో సంబంధిత విభాగానికి సంబంధించి 120 ప్రశ్నలు మరియు జనరల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ మొదలైనవి 30 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది.
జీతం :
SJVN Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 – రూ.1,60,000/- జీతం ఇస్తారు. ఇతర అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.80,000/- వరకు జీతం ఇవ్వొచ్చు.
దరఖాస్తు విధానం :
SJVN Executive Trainee Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 28వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్ లైన్ దరఖాస్తు ఫారమ్ ని నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 – 04 – 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 18 – 05 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |
Bhukya punnam Kumar