Telangana Inter Results 2025 తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,88,448 మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా, 5,08,253 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు.. ఇంటర్ ఫలితాలను కింది పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు.
How to Check TS Inter Results 2025:
- ఫలితాలు చెక్ చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ సందర్శించాలి.
- ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి.
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ రిజిల్ట్స్ ఆప్షన్ పై మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. వెంటనే ఫలితాలు వస్తాయి.
- ఫలితాలను పీడీఎఫ్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
TS Inter Results 2025 Check Via SMS:
తెలంగాణ ఇంటర్ ఫలితాలను మొబైల్ లో ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. SMS ద్వారా తెలుసుకునే విధానాన్ని కింద చూడవచ్చు.
జనరల్ స్ట్రీమ్ విద్యార్థులు :
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ : TSGEN1 <Hall Ticket Number> 56263 కి పంపాలి
- ఇంటర్ సెకండ్ ఇయర్ : TSGEN2 <Hall Ticket Number> 56263 కి పంపాలి
ఒకేషన్ విద్యార్థులు:
- ఫస్ట్ ఇయర్ : TSVOC1 <Hall Ticket Number> 56263 కి పంపాలి.
- సెకండ్ ఇయర్ : TSVOC2 <Hall Ticket Number> 56263 కి పంపాలి.
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు?
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
- Inter Results Check 1: CLICK HERE
- Inter Results Check 2 : CLICK HERE