NCL Technician Recruitment 2025 నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 200 టెక్నీషియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
NCL Technician Recruitment 2025
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్, సింగ్రౌలి(మధ్యప్రదేశ్) మరియు సోన్ భద్ర(ఉత్తరప్రదేశ్) నుంచి విడుదలైంది. భారతీయ పౌరులందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 200 టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 200
టెక్నీషియన్ కేటగిరీ | ఖాళీలు |
ఫిట్టర్ (ట్రైనీ) కేటగిరి-III | 95 |
ఎలక్ట్రీషియన్ (ట్రైనీ) కేటగిరి-III | 95 |
వెల్డర్(ట్రైనీ) కేటగిరి-II | 10 |
అర్హతలు :
NCL Technician Recruitment 2025 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ తో పాటు ఒక సంవత్సరం అప్రెంటీస్ షిప్ అర్హత కలిగి ఉండాలి.
వయస్సు:
NCL Technician Recruitment 2025 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
NCL Technician Recruitment 2025 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,180/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
UR / EWS /OBC | రూ.1,180/- |
SC / ST / PWBD / EXSM / WOMEN | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
NCL Technician Recruitment 2025 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ట్రేడ్ టెస్ట్
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం :
NCL Technician Recruitment 2025 టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో రోజు వారీ వేతనం ఇస్తారు.
టెక్నీషియన్ కేటగిరీ | జీతం |
ఫిట్టర్ (ట్రైనీ) కేటగిరి-III | రోజుకు రూ.1,583/- |
ఎలక్ట్రీషియన్ (ట్రైనీ) కేటగిరి-III | రోజుకు రూ.1,583/- |
వెల్డర్(ట్రైనీ) కేటగిరి-II | రోజుకు రూ.1,536/- |
దరఖాస్తు విధానం:
NCL Technician Recruitment 2025 పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 17 – 04 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 10 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |