DRDO JRF Recruitment 2025: DRDO – వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(VRDE) నుంచి వివిధ విభాగాల్లో ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో సహా వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేేస్తారు. ఏప్రిల్ 21, 22, 23వ తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివరాల కోసం అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
DRDO JRF Recruitment 2025
పోస్టుల వివరాలు :
DRDO- వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కింద పలు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 11
పోస్టు పేరు | ఖాళీలు |
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ | 04 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 04 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 03 |
అర్హతలు :
DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో (కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) విభాగాల్లో ఫస్ట్ డివిజన్ తో BE / B.Tech లేదా ME /M.Tech చేసి ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కార్డు ఉండాలి.
వయస్సు :
DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 28 సంత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఏప్రిల్ 21, 22, 23వ తేదీల్లో సంబంధిత విభాగాల వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు.
జీతం :
DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,000/- స్టైఫండ్ తో పాటు HRA కూడా ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ :
DRDO JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. DRDO అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లో వివరాలను పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
కావాల్సిన డాక్యుమెంట్స్:
- విద్యార్హత సర్టిఫికెట్లు
- గేట్ స్కోర్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రం(వర్తిస్తే)
- ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్(ఏదైనా ఉంటే)
- ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా పాస్ పోర్ట్
- ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలి.
ఇంటర్వ్యూ వేదిక : VRDE , Vahan nagar PO, Ahmednagar – 414006, Maharashtra
ఇంటర్వ్యూ తేదీలు :
పోస్టు విభాాగాలు | ఇంటర్వ్యూ తేదీ |
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ | ఏప్రిల్ 21 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | ఏప్రిల్ 22 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | ఏప్రిల్ 23 |
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |
Job application
Thanks
DRDO JRF