AP Anganwadi Jobs 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 948 అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో అంగన్ వాడీ వర్కర్ పోస్టులు 160, అంగన్ వాడీ హెల్పర్ పోస్టులు 728, మినీ అంగన్ వాడీ వర్కర్ పోస్టులు 60 ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ పోస్టులను ఒకేసారి కాకుండా జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఆ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తారు.
తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం పోస్టులు 17 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో అందజేయాలి.
మండలాల వారీగా పోస్టుల వివరాలు :
మండలం | ఖాళీలు |
పార్వతీపురం | 2 అంగన్ వాడీ హెల్పర్ పోస్టులు |
సాలూరు | 3 అంగన్ వాడీ హెల్పర్ |
బలిజిపేట | 1 అంగన్ వాడీ వర్కర్ మరియు 3 అంగన్వాడీ హెల్పర్ |
సీతానగరం | 2 అంగన్ వాడీ హెల్పర్ |
పాలకొండ | 3 అంగన్ వాడీ హెల్పర్ |
భామిని | 2 అంగన్ వాడీ హెల్పర్ |
వీరఘట్టం | 1 అంగన్ వాడీ హెల్పర్ |
అర్హతలు :
AP Anganwadi Jobs 2025 పార్వతీపురం మన్యం జిల్లా అంగన్ వాడీ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 7వ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు.
వయస్సు:
AP Anganwadi Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు కలిగిన అభ్యర్థి లేకపోతే, 18 ఏళ్లు నిండిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
AP Anganwadi Jobs 2025 పోస్టులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ పోస్టులను ఎటువంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపికే చేస్తారు. మొత్తం 100 మార్కుల ఉంటాయి.
10వ తరగతి మెరిట్ | 50 మార్కులు |
ప్రీ స్కూల్ ట్రైనింగ్ పొందితే | 5 మార్కులు |
విడో | 5 మార్కులు |
చిన్న పిల్లలతో కూడి విడో | 5 మార్కులు |
అనాథలుగా ఉండే అభ్యర్థికి | 10 మార్కులు |
దివ్యాంగ అభ్యర్థి | 5 మార్కులు |
ఇంటర్వ్యూకు | 20 మార్కులు |
మొత్తం | 100 మార్కులు |
జీతం :
AP Anganwadi Jobs 2025 అంగన్ వాడీ వర్కర్ కు రూ.11,500/-, మిని అంగన్ వాడీ వర్కర్ కి రూ.9,000/-, అంగన్ వాడీ హెల్పర్ కి రూ.9,000/- జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
AP Anganwadi Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యార్హత, ఇతర సర్టిపికెట్లు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అఫీసర్ సంతకం చేయించి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ లో అప్లికేషన్ ఇవ్వాలి.
- దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ : 31 – 03 – 2025
కావాల్సిన డాక్యుమెంట్స్:
- డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
- 10వ తరగతి సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- రెసిడెంన్స్ సర్టిఫికెట్
- వివాహ ధ్రువీకరణ పత్రం
- సదరం సర్టిఫికెట్(దివ్యాంగులకు)
- అనాధ సర్టిఫికెట్(ఉంటే)
- పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
APPLICATION | CLICK HERE |
I want job
Job apply
I want job