BHU Recruitment 2025 బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేయడం జరిగింది. గ్రూప్ ‘సి’ నాన్ టీచింగ్ పోస్టుల కింద జూనియర్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేేస్తున్నారు. మొత్తం 199 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారతదేశ పౌరులు అందరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
BHU Recruitment 2025
పోస్టుల వివరాలు :
బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి గ్రూప్ సి నాన్ టీచింగ్ పోస్టుల కింద జూనియర్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం పోస్టులు 199 ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ క్లర్క్ | 199 |
అర్హతలు :
BHU Recruitment 2025 బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జూనియర్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు కనీసం ఆరు నెలల కంప్యూటర్ కోర్సు చేసి ఉండాలి. అదనంగా ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. నిమిసానికి 30 పదాలు ఇంగ్లీష్ లేదా నిమిషానికి 25 పదాలు హిందీ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయస్సు:
BHU Recruitment 2025 జూనియర్ క్లర్క్ పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
BHU Recruitment 2025 జూనియర్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబిడి, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
UR / EWS / OBC | రూ.500/- |
SC / ST / PwBD / Women | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
BHU Recruitment 2025 జూనియర్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష, టైపింగ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
- రాత పరీక్ష
- కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష
- టైపింగ్ స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం :
BHU Recruitment 2025 జూనియర్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-2 కింద రూ.19,900/- నుంచి రూ.63,200/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
BHU Recruitment 2025 జూనియర్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో మీ ఫోటో గ్రాఫ్, సంతకం యొక్క స్కాన్ కాపీలను అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. అనంతరం అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి. డౌన్ లోడ్ చేసుకున్న అప్లికేషన్ ను అవసరమైన పత్రాలతో కింది చిరునామాకు పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్:
Office of the Registrar, Recruitment & Assessment Cell, Holkar House, BHU, Varanasi -221005 (U.P.)
ముక్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 18 – 03 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 17 – 04 – 2025 |
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ | 22 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |