NPS Trust Recruitment 2025 నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మార్చి 26వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తులను ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ మోడ్ లో లేదా పోస్ట్ ద్వారా పంపాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
NPS Trust Recruitment 2025
పోస్టుల వివరాలు :
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ లో కాంట్రాక్ట్ ప్రాదిపదికన ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 05
పోస్టు పేరు | ఖాళీలు |
ఎగ్జిక్యూటివ్(ఎగ్జిట్ అండ్ విత్ డ్రా) | 2 |
ఎగ్జిక్యూటివ్ (గ్రీవెన్స్) | 2 |
సీనయర్ ఎగ్జిక్యూటివ్(లీగల్) | 1 |
అర్హతలు :
NPS Trust Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు CA (ఇంటర్మీడియట్), ICAI / MBA / PGDM / M.Com బ్యాచిలర్ డిగ్రీ (లా) చేసిన అభ్యర్థులు అర్హులు.
ఎగ్జిక్యూటివ్ | CA (ఇంటర్మీడియట్), ICAI / MBA / PGDM / M.Com |
సీనియర్ ఎగ్జిక్యూటివ్(లా) | బ్యాచిలర్ డిగ్రీ (లా) |
వయస్సు:
NPS Trust Recruitment 2025 నేషనల్ పెన్షన్ ట్రస్ట్ లో ఎగ్జిక్యూటిివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు :
NPS Trust Recruitment 2025 నేషనల్ పెన్షన్ ట్రస్ట్ లో ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేేదు. అందరూ ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
NPS Trust Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట వారి అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన వారికి ఉద్యోగం ఇస్తారు.
జీతం :
NPS Trust Recruitment 2025 నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతాలు చెల్లిస్తారు.
పోస్టు | జీతం |
ఎగ్జిక్యూటివ్ | రూ.70,000/- |
సీనియర్ ఎగ్జిక్యూటివ్ | రూ.80,000/- |
దరఖాస్తు విధానం :
NPS Trust Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోండి. పూర్తి చేసిన అప్లికేషన్ ని కింద ఇచ్చిన చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన చిరునామా : General Manager (Human Resource), National Pension System trust, Tower B, B-302, Third Floor, World Trade Centre, Block F, Nauroji Nagar, New Delhi – 110029
Notification & Application : CLICK HERE
Official Website : CLICK HERE