Rail Wheel Factory Recruitment 2025 రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 192 అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. పదో తరగతితో పాటు ఐటీఐ సర్టిపికెట్ ఉన్న వారు ఈ పోస్టులకు దరకాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆసక్లి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
Rail Wheel Factory Recruitment 2025
పోస్టుల వివరాలు :
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. మొత్తం 192 అప్రెంటీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వివిధ ట్రేడ్ లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ట్రేడ్ ల వారీగా ఖాళీలను చూస్తే..
అప్రెంటిస్ ట్రేడ్స్ | ఖాళీలు |
ఫిట్టర్ | 85 |
మెషినిస్ట్ | 31 |
మెకానిక్(మోటారు వాహనం) | 08 |
టర్నర్ | 05 |
CNC ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ | 23 |
ఎలక్ట్రీషియన్ | 18 |
ఎలక్ట్రానిక్ మెకానిక్ | 22 |
అర్హతలు:
Rail Wheel Factory Recruitment 2025 రైల్వే వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ పొంది ఉండాలి.
వయస్సు :
Rail Wheel Factory Recruitment 2025 రైల్వే వీల్ ఫ్యాక్టరీలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01-03-2025 నాటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
Rail Wheel Factory Recruitment 2025 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ‘ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైసర్ రైల్ వీల్ ఫ్యాక్టరీ’ పేరు మీద పోస్టల్ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
కేటగిరీ | ఫీజు |
UR / OBC / EWS | ₹100 |
SC / ST / PWD | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
Rail Wheel Factory Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
Rail Wheel Factory Recruitment 2025 రైల్వే వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెలకు రూ.12,261/- స్టై ఫండ్ ఇస్తారు. సీఎన్ఎస్ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ పోస్టుకు ఎంపికైన వారికి మాత్రం రూ.10,899/- స్టయిఫండ్ అందజేస్తారు.
దరఖాస్తు విధానం :
Rail Wheel Factory Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లో వివరాలు పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. ఈ అప్లికేషన్ మరియు ఫీజు చెల్లించిన రషీదును నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
ముఖ్యమైన తేదీలు :
Rail Wheel Factory Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేేదీ | 01 – 03 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 01 – 04 – 2025 |
Notification & Application | CLICK HERE |
Official Website | CLICK HERE |
Yes, sir and madam i want job