TMB Recruitment 2025: తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్(TMB) నుంచి ఉద్యోగాల నియామకల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేేస్తున్నారు. మొత్తం 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వారు సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
TMB Recruitment 2025
పోస్టుల వివరాలు :
గుర్తింపు పొందిన బ్యాంక్ అయిన తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 124 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. రీజనల్ లాంగ్వేజ్ వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు :
TMB Recruitment 2025 తమిళనాడు మార్కెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ లో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
TMB Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
TMB Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసే అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.1,000/- ఫీజు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :
TMB Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు.
జీతం :
TMB Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.72,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
TMB Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.
NIRDPR Recruitment 2025 | పంచాయతీ రాజ్ శాఖలో జాబ్స్
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 28 – 02 – 2025
- అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ : 16 – 03 – 2025
- ఆన్ లైన్ పరీక్ష : ఏప్రిల్ 2025
- ఇంటర్వ్యూ మరియు తుది ఎంపిక : మే 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “TMB Recruitment 2025 | తెలుగు వచ్చిన వారికి బ్యాంక్ జాబ్స్”