SBI Youth for India Fellowship 2025 | డిగ్రీ పాసైన యువతకు గ్రామాల్లో సేవ చేస్తూ సంపాదించే ఛాన్స్

SBI Youth for India Fellowship 2025 : యంగ్ ప్రొఫెషనల్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్.. గ్రాడ్యుయేట్స్ చేసిన యువతకు గ్రామాల్లో సేవ చేస్తూ సంపాదించేే ఛాన్స్ ని SBI కల్పించింది. స్టేట్ బ్యాంక్ గ్రూప్ లోని SBI ఫౌండేషన్ ‘SBI Youth for India Fellowship 2025’ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశంలో సామాజికంగా మార్పులు తీసుకొచ్చేందుకు SBI ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా 13 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో స్టైఫండ్ ఇచ్చి తర్వాత భారీగా అలవెన్సులు ఇస్తారు. ఈ ప్రొగ్రామ్ కి అప్లయ్ చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు, వయసు తదితర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

SBI Youth for India Fellowship 2025

ఫెలో షిప్ కోసం అర్హతలు : 

  • SBI Youth for India Fellowship 2025 అప్లయ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(BA, B.Com, BSc) చేసి ఉండాలి. డిగ్రీని అక్టోబర్ 1, 2025 లోపు పూర్తి చేయాలి. 
  • భారతీయ పౌరులు, నేపాల్ / భూటాన్ పౌరులు, భారతదేశ విదేశీ పౌరులు(OCI) అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. 

Railway SECR Recruitment 2025 | రైల్వే శాఖలో పార్ట్ టైమ్ టీచర్స్ జాబ్స్

వయస్సు : 

SBI Youth for India Fellowship 2025 కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆగస్టు 5, 1993 మరియు అక్టోబర్ 6, 2004 మధ్య జన్మించి ఉండాలి. 

ఫెలో షిప్ వివరాలు మరియు జీతం : 

SBI Youth for India Fellowship 2025 లో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు 13 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో నెలకు రూ.16,000/- స్టైఫండ్ ఇస్తారు. రవాణా ఖర్చుల కోసం రూ.2,000/-, ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం రూ.1000/- అంటే నెలకు మొత్తం రూ.19,000 స్టైఫండ్ ఇస్తారు. ఇక ఫెలోషిప్ అయిపోయిన తర్వాత ఒకేసారి రూ.90,000/- అందజేస్తారు. దీంతో పాటు ఫెలోషిప్ కాలానికి ఆరోగ్య బీమా అందిస్తారు. అకామడేషన్ మరియు లివింగ్ ఎక్స్ పెన్సెస్ ఎస్బీఐ భరిస్తుంది. తిరుగు ప్రయాణ రైలు టికెట్ ఛార్జీలు కూడా అందిస్తుంది. 

ఫెలోషిప్ కి ఎంపికైన వారు గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడానికి పనిచేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ సంఘాలు, టాప్ NGOలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ 13 నెలల కారక్య్రమం పూర్తి అయిన తర్వాత SBI Youth for India Fellowship ఉద్యోగ నియామకానికి హామీ అయితే ఇవ్వదు. ఎంపిక చేసిన అభ్యర్థులు ఫెలషిప్ మొత్తం ప్రాజెక్ట్ ప్రదేశంలో ఉండాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : 

SBI Youth for India Fellowship 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ : 

SBI Youth for India Fellowship 2025 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ అసెస్మెంట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆ్ లైన్ అసెస్మెంట్ లో అభ్యర్థులు ఇంటి నుంచే MCQ – ఆధారిత పరీక్షను పూర్తి చేయాలి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. 

దరఖాస్తు విధానం : 

SBI Youth for India Fellowship 2025 కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం దరఖాస్తులు చేసుకోవడానికి విండో అయితే ఓపెన్ చేసి ఉంది. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోగలరు. 

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Official Website : CLICK HERE

1 thought on “SBI Youth for India Fellowship 2025 | డిగ్రీ పాసైన యువతకు గ్రామాల్లో సేవ చేస్తూ సంపాదించే ఛాన్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!