NCRPB Recruitment 2025 నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డు(NCRPB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మాల్టీ టాస్కింగ్ స్టాప్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C & D పోస్టుల నియామకానికి ప్లానింగ్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 08 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు. మార్చి 22వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
NCRPB Recruitment 2025
పోస్టుల వివరాలు :
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డు (NCRPB) నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫ్ గ్రేడ్ C మరియు స్టెనోగ్రాఫ్ గ్రేడ్ D పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 08 పోస్టులు ఉన్నాయి.
● మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 04
● స్టెనో గ్రాఫర్ గ్రేడ్ సి – 01
● స్టెనో గ్రాఫర్ గ్రేడ్ డి – 03
అర్హతలు :
NCRPB Recruitment 2025 నుంచి విడులైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్టెనో గ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనో గ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనో గ్రాఫర్ పోస్టులకు టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. స్టెనో గ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలకు షార్ట్ హ్యాండ్ లో 120 WPM మరియు టైపింగ్ లో 40 WPM స్పీడ్ ఉండాలి. స్టెనో గ్రాఫ్ గ్రేడ్ డి ఉద్యోగాలకు షార్ట్ హ్యాండ్ లో 80 WPM మరియు టైపింగ్ లో 40 WPM స్పీడ్ ఉండాలి.
వయస్సు :
NCRPB Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్టెనో గ్రాఫర్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు మించకూడదు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
NCRPB Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.100/- ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎమ్, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించి అప్లికేషన్ తో పాటు పంపాలి.
ఎంపిక ప్రక్రియ :
NCRPB Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కిల్ టెస్ట్ అనేది స్టెనో గ్రాఫర్ పోస్టులకు నిర్వహిస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్ నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
జీతం :
NCRPB Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు స్టెనో గ్రాఫర్ గ్రేడ్ సి ఉద్యోగాలకు రూ.44,900/- నుంచి రూ.1,42,400/- వరకు జీతం చెల్లిస్తారు. స్టెనో గ్రాఫర్ గ్రేడ్ డి ఉద్యోగాలకు రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు జీతం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు రూ.18,000/- నుంచి 56,900/- వరకు జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
NCRPB Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనో గ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవానుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్ :
Member Secretary, NCR Planning Board, 1st Floor, Core – 4B, India Habitat Centre, Lodhi Road, New delhi – 110003
ముఖ్యమైన తేదీలు :
● దరఖాస్తు ప్రారంభ తేదీ : 21 – 22 – 2025
● దరఖాస్తులకు చివరి తేదీ : 22 – 03 – 2025
Notification & Application : CLICK HERE
Official Website : CLICK HERE