BECIL Recruitment 2025 : Broadcast Engineering Consultants India(BECIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన DEO, జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 407 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోగలరు. ఈ రిక్రూట్మెంట్ యొక్క పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
BECIL Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 407
ఈ రిక్రూట్మెంట్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ కీపర్, జూనియర్ ఇంజనీర్, క్లర్క్, టెక్నీషియన్, సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు ఇంకా ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు నోటిఫికేషన్ చూసి ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలో ఒక సారి చెక్ చేసి అప్లయ్ చేసుకోండి.
అర్హతలు :
BECIL Recruitment 2025 ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మరియు ఇతర అర్హతలు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు.
NG Ranga University Recruitment 2025 | ఎన్జీ రంగా వర్సీటీ పరిధిలో జాబ్స్ | కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక
వయస్సు :
BECIL Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
BECIL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. ముందుగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు. ఇంటర్వ్యూలు అర్హత సాధిస్తే ఉద్యోగం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
BECIL Recruitment 2025 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజును ఆఫ్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.590/ ఫీజు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.295 ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. “Broadcast Engineering Consultants India Ltd, Noida” పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
జీతం :
BECIL Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- నుంచి రూ.50,000/- వరకు జీతం ఇస్తారు. అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
BECIL Recruitment 2025 దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ని పూర్తి చేసి విద్యార్హతల సర్టిఫికెట్లు, ఎక్స్ పీరియన్స్ సర్టిపికెట్ ఇతర డాక్యుమెంట్స్ జత చసి కింద ఇచ్చిన అడ్రస్ కి పోస్టు చేయాలి.
“Broadcast Engineering Consultants India Limited
(BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)”.
దరఖాస్తులకు చివరి తేదీ : 25 – 02 – 2025
Notification & Application : CLICK HERE
Website : CLICK HERE
1 thought on “BECIL Recruitment 2025 | సమాచార శాఖలో 407 జాబ్స్ | 10th/ ఇంటర్ అర్హత”