AP Govt jobs 2025 నెల్లూరు జిల్లా సెకండరీ హెల్త్ ఇన్ స్టిట్యూషన్స్ లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ మరియు బయో స్టాటిస్టిషియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 20 లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులను నెల్లూరు జిల్లాలో విడుదల చేసినప్పటికీ అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 13
➤ జనరల్ డ్యూటీ అటెండెంట్ – 09
➤ పోస్ట్ మార్టం అసిస్టెంట్ – 03
➤ బయో స్టాటిస్టిషియన్ – 01
AP DSC Notification 2025 | ఏపీ డీఎస్సీపై బిగ్ అప్ డేట్ |16,347 పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్
అర్హతలు :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు పోస్ట్ మార్గం అసిస్టెంట్ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. బయో స్టాటిస్టిషియన్ పోస్టుకు డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోగలరు.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతం :
జనరల్ డ్యూటీ అటెండెంట్ మరియు పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.15,000/- జీతం ఇస్తారు. బయో స్టాటిస్టిషియన్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.21,500 జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సులు ఉండవు.
అప్లికేషన్ ఫీజు :
జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ మరియు బయో స్టాటిస్టిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సి, ఎస్టి, బీసీ, ఈడబ్ల్యూఎస్ అబ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసేబుల్ పర్సన్ కి ఫీజు మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజును District Coordinator of Hospital Services, S.P.S.R. Nellore District పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు కేేవలం ఆఫ్ లైన్ పద్ధతిలో అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని, వివరాలను పూర్తి చేయాలి. సంబంధించి డాక్యుమెంట్స్ ను, డిమాండ్ డ్రాఫ్ట్ జత చేసి స్వయంగా సంబంధిత కార్యాలయంలో అందజేయవచ్చు. లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అయినా పంపొచ్చు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్ర 5 గంటల లోపు దరఖాస్తులను సమర్పించాలి.
దరఖాస్తులు సమర్పించాల్సిన అడ్రస్ :
the office of the District Coordinator of Hospital Services (DSH), S.P.S.R. Nellore District, C/o. 1st floor of old Jublee Hospital, Near Vegetable Market, Nellore S.P.S.R. Nellore District.
దరఖాస్తులకు చివరి తేదీ : 20 – 02 – 2025
Notification : CLICK HERE
Official website : CLICK HERE
1 thought on “AP Govt jobs 2025 | 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | పరీక్ష లేకుండా మెరిట్ చూసి ఉద్యోగం”