సీఏ టాపర్ గా పేదింటి అమ్మాయి.. రాత్రిపూట మాత్రమే చదువుకుంటూ..!

పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించింది ఆ పేదింటి అమ్మాయి.. ఆలిండియా సీఏ పరీక్షలో టాపర్ నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం రాత్రి పూట మాత్రమే చదువుకొని ఈ ఘనత సాధించింది.  ముంబై, థానేలోని ముంబ్రాకు చెందిన జరీన్ ఖాన్ తన తల్లిదండ్రులు, ముగ్గురు తోబుట్టువులతో చిన్న ఇంట్లో నివిసిస్తోంది.

అయితే ఆ ఇంట్లో ఆమెకు చదువుకొనేందుకు అంత సౌకర్యంగా ఉండేది కాదు. ఆమె ఇల్లు రోడ్డు పక్కన ఉండటంతో నిత్యం వాహనాల శబ్దాలు ఇబ్బందులకు గురిచేసేవి. అందుకు ఆమె కేవలం రాత్రి పూట మాత్రమే చదువుకునేది. తన కష్టమే ఆమెకు టాపర్ గా నిలబెట్టింది. 

‘సీఏ పరీక్ష రాసేందుకు చాలా భయపడ్డాను. కానీ కుటుంబ సభ్యులు మద్దతు తెలపడంతో కష్టపడి చదివాను. రెండేళ్ల గ్యాప్ తర్వాత గత సంవత్సరం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాను. సీఏలో మొదటి స్థానంలో పాసయ్యావని ఫ్రెండ్స్ చెబితే నమ్మలేకపోయాను. తర్వాత తెలుసుకొని ఆశ్చర్యపోయాను. 4094 మంది విద్యార్థులు సీఏ పరీక్ష ఉత్తీర్ణత కాగా నేను ఫస్ట్ ర్యాంక్ లో నిలవడం సంతోషంగా ఉంది’. అంటూ జరీన్ ఖాన్ ఆనందం వ్యక్తం చేసింది.   

 

Leave a Comment